వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఐడీ ఎస్సై అనుమానాస్పద మృతి.. హోటల్ గదిలో అచేతనంగా.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

పోలీసు శాఖలో గల నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడం మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తి సీఐడీ ఎస్సై కావడం విశేషం. దీంతో అతనిని శత్రువులే మట్టుబెట్టారా అనే అనుమానాలు వస్తున్నాయి.

ఎస్సై మృతి..

ఎస్సై మృతి..

వైశాలి జిల్లా అరారా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ గోపాల్ గంజ్‌లోని సీఐడీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 9-10 గంటల సమయంలో అతడి బంధువు నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి తన బావ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హోటల్‌లో బస

హోటల్‌లో బస

సంజయ్ కుమార్ ఏప్రిల్ 3న విధి నిర్వహణలో భాగంగా గోపాల్ గంజ్ జిల్లాలో గల ఒక హోటల్ లో బస చేస్తున్నాడు. ఆదివారం గోరఖ్ పూర్ వెళ్లాలని బయలు దేరి వెళ్లి ..తిరిగి రాత్రి 8-30 గంటలకు హోటల్ కు తిరిగి వచ్చేశాడు. సోమవారం కుమార్ తన హోటల్ గదినుంచి బయటకు రాలేదు. అదే సమయంలో కుమార్ భార్య ఫోన్ చేసినా సమాధానం రాక పోయేసరికి ఆమె హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పింది.

 గదిలో మృతి

గదిలో మృతి

హోటల్ సిబ్బంది వెంటనే సంజయ్ కుమార్ బస చేసిన గదికి వచ్చి తలుపు కొట్టగా ఎటువంటి సమాధానం రాకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్‌కు వచ్చిన పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా ఎస్సై అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉన్నాడు. అతని రూం నుంచి మూడు ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్ లభించలే

సూసైడ్ నోట్ లభించలే

గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాల్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని... అధికంగా మద్యం సేవించినట్టు ప్రాధమికంగా గుర్తించామని ఎస్సై సురేంద్రకుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక మరణానికి కారణాలు తెలుస్తాయని తెలిపారు.

English summary
CID Sub Inspector Mysterious death in Bihar vaishali district arara village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X