అందులో నిజం లేదు.. దానిపై కాంగ్రెస్‌తో ఎలాంటి ఒప్పందం జరగలేదు: కుమారస్వామి

బెంగళూరు: ఎడతెగని ఉత్కంఠకు తెరదించిన కర్ణాటక రాజకీయాలు ఇక సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దమైపోయారు.

ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. కేబినెట్ బెర్తులు, డిప్యూటీ సీఎం పదవి విషయంలోనే రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదన్న వాదన ఒకటి తెరపైకి వచ్చింది. దీంతో రెండు పార్టీల మధ్య కలహాలు అప్పుడే మొదలయ్యాయా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే అవన్నీ నిరాధారిత ప్రచారాలేనని కుమారస్వామి స్పష్టం చేశారు. రెండు పార్టీలు సమన్వయంతోనే ముందుకెళ్తాయని నొక్కి చెప్పారు.

అందులో నిజం లేదు:

అందులో నిజం లేదు:

'రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్‌తో భేటీ అవుతాను. కేబినెట్‌ విస్తరణ అంశంతో పాటు ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను. సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం' అని కుమారస్వామి వెల్లడించారు. కుమారస్వామితో పాటు సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు.

విభేదాలకు తావు లేదు:

విభేదాలకు తావు లేదు:

సీఎం సీటుతో పాటు కేబినెట్ బెర్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీతో అప్పుడే కలహాలు మొదలయ్యాయన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు కుమారస్వామి. ఇక రాజరాజేశ్వరినగర్, జయనగర్‌ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ఈ రెండు చోట్ల గెలవడం తమకు చాలా ముఖ్యమైనప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే దానిపై దృష్టి సారిస్తామన్నారు.

కాంగ్రెస్ నేతలతో భేటీ:

కాంగ్రెస్ నేతలతో భేటీ:

ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే విశ్వాస పరీక్షకు వెళ్తామని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై కాంగ్రెస్‌ నేతలతో ఆదివారం కుమారస్వామి చర్చించారు. అదే సమయంలో కేబినెట్ బెర్తులు, డిప్యూటీ సీఎం పదవి గురించి కూడా చర్చించినట్టు సమాచారం. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్‌ నుంచి దళిత నేత అయిన పీసీసీ చీఫ్‌ జి. పరమేశ్వర్ పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది.

జేడీఎస్ 13, కాంగ్రెస్ 20..:

జేడీఎస్ 13, కాంగ్రెస్ 20..:


కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రాధాన్యత రీత్యా ఆ పార్టీకి 20కేబినెట్ స్థానాలు ఇచ్చి సీఎం సీటు సహా 13స్థానాలను జేడీఎస్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆర్థికశాఖను కుమారస్వామి తన వద్దే ఉంచుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక కూటమి ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు చిక్కకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ నేత డీకె శివకుమార్ కి కూడా ఏదైనా కీలక శాఖను అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యేలు ఎక్కడ:

ప్రస్తుతానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. సోమవారం(మే 21) మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 27వ వర్ధంతి కారణంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు. ఇక బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతోనూ కుమారస్వామి భేటీ అయ్యారు. వారు ఇంటికెళ్లాలా? లేక ఇంకా క్యాంపులోనే ఉండాలా అన్న విషయాన్ని వారికే వదిలేసినట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+