బీజేపీలో ‘కాంగ్రెస్ డిఎన్ఎ’: మంత్రి పదవుల కోసం ఎదురుచూపులు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరాశా జనక ఫలితాలు కొనసాగిస్తుంటే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సుమారు 25 మంది మాజీ కాంగ్రెస్ నేతలకు స్వర్ణ యుగం పట్టుకున్నది. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరిపోయారు. మణిపూర్, గోవాలలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు.. మణిపూర్‌లో ఏకంగా సీఎం పదవిని అలంకరించారు.

ఇక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పదవుల కోసం మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నైపుణ్య భరితంగా 'కాంగ్రెస్ పార్టీ రహిత భారత్' స్థాపన కోసం రాజకీయంగా అర్థ, అంగ బలాలను ప్రదర్శిస్తూ బీజేపీ రణన్నినాదం చేస్తోంది. ఎన్నికల వేళ జంపింగ్ రాయుళ్లతో నాలుగు రాష్ట్రాల్లో 'కాంగ్రెస్ - డిఎన్ఎ'తో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ ఏర్పాటు చేస్తోంది.

ఇబోబీ సింగ్ క్యాబినెట్ సభ్యుడే నేటి సీఎం

ఇబోబీ సింగ్ క్యాబినెట్ సభ్యుడే నేటి సీఎం

మణిపూర్ సీఎం నాంగ్థోమ్ బామ్ బీరెన్ సింగ్.. బీజేపీలో చేరడానికి ముందు వరకు మాజీ సీఎం ఇబోబీసింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. నాటి సీఎం ఇబోబిసింగ్‌తో వ్యక్తిగత విభేదాల కారణంగా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. మిత్ర పక్షాల మద్దతుతో మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన తొలి క్యాబినెట్‌లో మాజీ కాంగ్రెస్ పార్టీ నేత ఎల్ జయకుమార్ సింగ్ ఇంతకుముందు ఓక్రాం ఇబోబీసింగ్ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన వారే. ఇబోబిసింగ్ హయాంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన శ్యామ్ కుమార్ సింగ్. బీజేపీలోకి ఫిరాయించక ముందు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునే విజయం సాధించారు.

త్రుణమూల్ మీదుగా బీజేపీలోకి బిశ్వజిత్

త్రుణమూల్ మీదుగా బీజేపీలోకి బిశ్వజిత్

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన థోంగం బిశ్వజిత్ తర్వాత త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల ముందు బీజేపీలో చేరడంతోపాటు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా బీరెన్ సింగ్ క్యాబినెట్ లో బెర్త్ సంపాదించుకున్నారు.

డిప్యూటీ సీఎం.. రాష్ట్ర మాజీ పోలీస్ చీఫ్

డిప్యూటీ సీఎం.. రాష్ట్ర మాజీ పోలీస్ చీఫ్

మణిపూర్ నూతన డిప్యూటీ సీఎం వై జాయ్ కుమార్ సింగ్‌ది మరింత ఆసక్తికరమైన అంశం. రాష్ట్ర పోలీస్ చీఫ్‌గా రిటైరైన జాయ్ కుమార్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కోరుకున్నా.. ఆ పార్టీ తిరస్కరించింది. తర్వాత బీజేపీలో చేరినా పార్టీ టిక్కెట్ నిరాకరించింది. చివరి క్షణంలో లోక్ సభ మాజీ స్పీకర్ పీ ఏ సంగ్మా స్థాపించిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు జరిగిన చర్చల్లో డిప్యూటీ సీఎం పదవి సంపాదించారు.

కమలనాథులకు వ్యతిరేకమైనా పారికర్ క్యాబినెట్‌లో చోటు

కమలనాథులకు వ్యతిరేకమైనా పారికర్ క్యాబినెట్‌లో చోటు

ఇక గోవాలో మనోహర్ పారికర్ ప్రభుత్వం కూడా పూర్తిగా గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) సారథ్యంలో గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతుతోనే ఏర్పాటైంది. జీఎఫ్‌పీ అధినేత విజయ్ సర్దేశాయి 2012 వరకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నేతే. పార్టీ నాయకత్వం టిక్కెట్ నిరాకరించడంతో గోవా ఫార్వర్డ్ పార్టీ స్థాపించారు. విజయ్ సర్దేశాయి సహచరులు జయేశ్ సాల్గోంవకర్, వినోద్ పాలేకర్ కూడా ఇటీవలి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉన్నారు. బీజేపీ వ్యతిరేకతతోనే ముగ్గురు జీఎఫ్‌పీ నుంచి గెలుపొందారు. వీరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో అభ్యర్థులను కూడా నిలుపలేదు. అయితే విజయ్ సర్దేశాయితో వ్యక్తిగత విభేదాల కారణంగా గోవా పీసీసీ అధ్యక్షుడు లౌజిన్హో ఫాలెరియో.. విజయ్ సర్దేశాయికి వ్యతిరేకంగా స్థానిక నాయకుడ్ని బరిలోకి దించారు.

కాంగ్రెస్ పార్టీకి విశ్వజిత్ ప్రతాప్ రాణె గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి విశ్వజిత్ ప్రతాప్ రాణె గుడ్ బై

తనపై ప్రత్యర్థిని నిలిపిన ఫాలెరియోపై సర్దేశాయి ప్రతీకారం తీర్చుకోవాలని తలపోశారు. అందుకు అనుగుణంగానే ప్రతాప్ సింగ్ రాణెను సీఎంగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందు ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకునే లోగా ముగ్గురు బీజేపీలో చేరి ఏం చక్కా క్యాబినెట్ మంత్రులయ్యారు. ప్రతాప్ సింగ్ రాణె తనయుడు విశ్వజిత్ ప్రతాప్ రాణె గురువారం కాంగ్రెస్ పార్టీని వీడారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, జీఎఫ్‌పీ బేరసారాల సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఆయన నిశితంగా పని చేసే అవకాశం ఉంది.

విజయ్ బహుగుణ, సత్పాల్ నాటి కాంగ్రెస్ గూటి పక్షులే

విజయ్ బహుగుణ, సత్పాల్ నాటి కాంగ్రెస్ గూటి పక్షులే

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 13 మంది మాజీ కాంగ్రెస్ నేతలు, మంత్రులు, బీజేపీలో చేరారు. గత హరీశ్ రావత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సాగిస్తున్న పోరాటంలో వారు కీలక పాత్ర పోషించారు. వారిలో సత్పాల్ మహారాజ్, హరక్ సింగ్ రావత్, యశ్‌పాల్ ఆర్యా, సుబోధ్ ఉనియల్, ప్రతాప్ బత్రా, ప్రణవ్ సింగ్ చాంపియన్, రేఖా ఆర్యా, శైలేశ్ మోహన్ సింగ్, ఉమేశ్ శర్మ, కేదార్ సింగ్ రావత్, మాజీ సీఎం విజయ్ బహుగుణ తనయుడు సౌరవ తదితరులు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి క్యాబినెట్‌లో చేరిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మాజీ యూపీసీసీ చీఫ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే

మాజీ యూపీసీసీ చీఫ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే

ఇక యూపీలో కాంగ్రెస్ పార్టీతోపాటు సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ నేతలపై కమలనాథులు ‘ఫిరాయింపుల వల' విసురుతున్నారు. యూపీసీసీ చీఫ్ గా పని చేసిన రీటా బహుగుణ మొదలు భట్టా పర్సౌల్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వెన్నంటి ఉన్న ధీరిందర్ సింగ్ కూడా బీజేపీలో చేరిపోయి మంత్రివర్గంలో చేరికకు ఎదురుచూస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ సోదరే రీటా బహుగుణ కావడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NEW DELHI: Even as Congress’ electoral fortunes continued to remain poor, almost two dozen leaders who joined the BJP — many on election eve — gained ministerial posts in Manipur and Goa, even as those in Uttarakhand and Uttar Pradesh awaited their turn.
Please Wait while comments are loading...