
viral:ఏందీ సామి ఇదీ.. స్వీట్ కార్న్ రూ.15 ఉండొద్దా, కేంద్రమంత్రి వీడియో.. వైరల్
ఇప్పుడు అంతా చల్లని వాతావరణం లేదంటే ముసురు ఉంది. వర్షాలతో చలిగా ఉంది. వేడి వేడిగా స్వీట్ కార్న్ ఉడకబెట్టి.. దానికి కారం, ఉప్పు రాసి తింటే ఉంటది స్వామి.. అవును ఈ టేస్ట్ అందరికీ తెలుసు.. మంత్రులు దీనికి అతీతులు ఏమీ కారు. అలా కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కూడా సీజన్‌లో రుచి చూడాలని అనుకున్నారు. కానీ ధర చూసి ఆయనే నోరెళ్ల బెట్టారు. అయితే అదీ అంత రేటు మాత్రం లేదు. మరీ సామాన్యులు ఎలా బతకాలి అనే ప్రశ్న వస్తోంది.

కార్న్ రేటు చూసి కళ్లు బైర్లు కమ్మాయి..
కులస్తే.. సియోని, మండ్లకు వెళ్లారు. రోడ్డు పక్కనే స్వీట్ కార్న్ కనిపించింది. అయ్యగారికి నోరూ ఊరింది. వెంటనే కారు ఆపివేశారు. వచ్చి మూడు తీసుకున్నాడు. ఉప్పు, నిమ్మరసం రాయాలని చెప్పాడు. ధర ఎంత అని అడిగేసరికి కాస్త షాక్ తిన్నాడు. అవును అతను రూ.45 చెప్పాడు. అదీ కూడా మూడింటికీ కలిపి చెప్పాడు. అంటే ఒక్కొటి రూ.15కు విక్రయిస్తున్నాడు. దానిని చూసి కేంద్రమంత్రి షాక్ తిన్నాడు.

కేజీ.. డజన్
కార్న్ కేజీకి ఎలా అని అతనితో ముచ్చటించాడు. అవీ డజన్ కింద వస్తాయని చెప్పారు. ఆ వీడియోను కేంద్రమంత్రి ట్వీట్ చేశారు. తాను స్థానిక రైతులు, చిన్న షాపు కీపర్స్ వద్ద కొనుగోలు చేస్తానని తెలిపారు. కానీ ధర గురించి మాత్రం షాక్ తినడంపై విపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తుంది. సదరు కేంద్రమంత్రి చాలా నిరుపేద.. అందుకే రూ.15 పెట్టి కార్న్ కొనలేని పరిస్థితి ఉందని పీసీసీ మీడియా సెల్ చీఫ్ కేకే మిశ్రా అన్నారు. కేంద్రమంత్రే ఇలా అంటే మరీ నిరుపేదల సంగతి ఏంటి అని ఆయన అడిగారు. ఆ వీడియోను ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ట్వీట్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా ట్యాగ్ చేశారు.

అదీ కాదు.. విషయం ఏమిటంటే..
కేంద్రమంత్రిపై విమర్శలు రావడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రోడ్డు పక్కన కారు ఆపి.. కార్న్ అమ్మేవాడితో ముచ్చటించాడని తెలిపారు. అంతేకాదు అడిగిన దాని కన్నా ఎక్కువే నగదు ఇచ్చాడని చెబుతున్నారు. కులస్తే ఎప్పుడు విజయం సాధిస్తున్నారని.. ఇదీ కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని చెప్పారు. మండ్ల నుంచి కులస్తే ఆరోపారి ఎంపీగా గెలిచారు.