Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా థర్డ్ వేవ్ వార్నింగ్? బెంగళూరులో ఇద్దరికి AY.4.2 కోవిడ్ కొత్త వేరియంట్‌; భారత్ కు కొత్త ఫియర్ !!

భారతదేశానికి కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవడం ఇప్పుడు భారత్ కు తలనొప్పిగా తయారైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఇటీవల కరోనా జీనోమ్ సీక్వెన్సింగ్ లో AY.4.2 వేరియంట్ సోకినట్టు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరు పాజిటివ్ పేషెంట్లకు AY.4.2 వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు.

ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ కేసులు .. బెంగళూరులోనూ కలకలం

ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ కేసులు .. బెంగళూరులోనూ కలకలం

AY.4.2 వేరియంట్ యూ కె, జర్మనీ మరియు రష్యాలలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతుందని భయపడుతున్నారు. అటువంటి వేరియంట్ ఇండియాలో కూడా కేసులను నమోదు చేయడం ఇప్పుడు ఆందోళనకు కారణం గా మారింది. కర్ణాటక రాష్ట్రంలో AY.4.2 వేరియంట్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం మళ్లీ కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇక ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ పేర్కొన్నారు. మహమ్మారి ఇంకా తగ్గలేదని గుర్తు చేశారు.

కరోనా AY.4.2 రెండు కేసులు .. కర్ణాటక సర్కార్ అలెర్ట్

కరోనా AY.4.2 రెండు కేసులు .. కర్ణాటక సర్కార్ అలెర్ట్

కరోనా AY.4.2 రెండు కేసులు కనుగొనబడ్డాయని , తాము పునర్నిర్ధారణ కోసం మరోమారు నమూనాలను పంపామని, నిపుణులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రికి వివరించి కొత్త మార్గదర్శకాలపై నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. మళ్లీ ఈ కొత్త వేరియంట్ ధృవీకరించబడితే, మేము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తో చర్చలు జరుపుతామని వెల్లడించారు. AY.4.2 కొత్త కోవిడ్ వేరియంట్‌ కారణంగా యూ కె, రష్యాలో మూడవ వేవ్ ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము కోవిడ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ని కలుస్తామని తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యల గురించి చర్చిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. మూడో వేవ్ వచ్చినా, మేము సిద్ధంగా ఉన్నామని , వ్యాక్సిన్ రెండు డోస్‌లు సాధారణంగా వేరియంట్‌ల నుండి రక్షణ కల్పిస్తాయని సుధాకర్ చెప్పారు.

 AY.4.2 వేరియంట్ కనుగొన్న ఇద్దరిలో లక్షణాలు లేవు

AY.4.2 వేరియంట్ కనుగొన్న ఇద్దరిలో లక్షణాలు లేవు

బీబీఎంపీ హెల్త్ కమీషనర్ త్రిలోక్ చంద్ర మాట్లాడుతూ, AY.4.2 వేరియంట్ కనుగొన్న ఇద్దరు రోగులలో లక్షణాలు లేవని తెలిపారు. వారు హోమ్ ఐసోలేషన్‌ లో ఉండి కోలుకున్నారని పేర్కొన్నారు . వారిలో ఒకరు చందాపురానికి చెందినవారు కాగా, మరొకరు కె నారాయణపురకు చెందినవారు అని త్రిలోక్ చంద్ర తెలిపారు. ఇద్దరు రోగుల ప్రాథమిక మరియు ద్వితీయ పరిచయాలు కూడా గుర్తించబడ్డాయని, వారి పరీక్షల రిపోర్టులు కూడా కరోనాకు ప్రతికూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కొత్త వేరియంట్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

AY.4.2, B.1.617.2 డెల్టా స్ట్రెయిన్ యొక్క మ్యుటేషన్,

AY.4.2, B.1.617.2 డెల్టా స్ట్రెయిన్ యొక్క మ్యుటేషన్,


వేరియంట్ వర్గీకరణపై గందరగోళం ఉండగా, దీనిపై చర్చించేందుకు ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం త్వరలో సమావేశమవుతుందని సమాచారం. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా డేటాను పంచుకోవడంపై గ్లోబల్ ఇనిషియేటివ్ మధ్యప్రదేశ్ లో AY.4.2 యొక్క ఏడు నమూనాలు కనుగొనబడ్డాయని పేర్కొంది . రెండు కర్ణాటకలో, తెలంగాణలో రెండు, కేరళలో నాలుగు, జమ్మూ & కాశ్మీర్ మరియు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు పేర్కొన్నారు. అక్టోబరు 21న, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ AY.4.2, B.1.617.2 డెల్టా స్ట్రెయిన్ యొక్క మ్యుటేషన్, పరిశోధనలో ఉన్న వేరియంట్‌గా గుర్తించబడింది.

 డెల్టా ఉప వంశంగా పుట్టుకొచ్చిన AY.4.2, ప్రమాదమా ? కాదా?

డెల్టా ఉప వంశంగా పుట్టుకొచ్చిన AY.4.2, ప్రమాదమా ? కాదా?


డెల్టా వేరియంట్ మొదటిసారిగా అక్టోబర్ 2020లో భారతదేశంలో కనుగొనబడింది. డెల్టా వేరియంట్ ఉత్పరివర్తన AY వంశం క్రమబద్ధీకరించబడిన అన్ని నమూనాలలో దాదాపు 70% కనుగొనబడింది.జెనోమిక్ సీక్వెన్సింగ్ కమిటీలో భాగమైన డాక్టర్ విశాల్ రావు, "కర్ణాటక పర్యవేక్షణ సామర్థ్యాలు బాగున్నాయని పేర్కొన్నారు. AY.4.2 అసలైన దాని కంటే మరింత ప్రమాదకరమైనదా కాదా అనేది ఇంకా నిర్ధారించబడలేదని పేర్కొన్నారు . AY.4.2 మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందా అన్న దానిపై శోధనలు జరుగుతున్నాయి. ప్రాథమిక విశ్లేషణల ప్రకారం, AY.4.2 మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని యూకే నుండి స్పష్టమైన సూచన లేదు కానీ దీనిపై ఆందోళన వ్యక్తం అవుతుంది. చూడాలి ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందో ?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+