వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓఖీ తుపాన్: కేరళను అతలాకుతలం చేసి.. మహారాష్ట్ర దిశగా, ముంబైలో భారీ వర్షాలు

కేరళలో విధ్వంసం సృష్టించిన ఓఖీ తుపాన్ మహారాష్ట్రను తాకింది. ముంబై దిశగా పయనిస్తుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓఖీతో మంగళవారం ఉదయం నుంచి ముంబైలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Cyclone Okchi Updates : Video

ముంబై: కేరళలో విధ్వంసం సృష్టించిన ఓఖీ తుపాన్ మహారాష్ట్రను తాకింది. ముంబై దిశగా పయనిస్తుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓఖీతో మంగళవారం ఉదయం నుంచి ముంబైలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.

రాబోయే రెండ్రోజుల్లో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంబై నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

రైల్వే స్టేషన్ వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం నాటికి ఓఖీ తపాన్ గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా గుజరాత్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Cyclone Ockhi to make landfall in Mumbai, Gujarat


మరోవైపు ఓఖీ తుపాన్‌ ప్రభావానికి కేరళలో అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. ఓఖీ దెబ్బకు 25 మంది చనిపోగా వందమందికిపైగా ఆచూకి తెలియరాలేదు.

వాయు, నౌకాదళ విభాగాలు 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరోవైపు తుపాన్ దెబ్బకు నష్టపోయిన కేరళ, తమిళనాడును ఆదుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.

Cyclone Ockhi to make landfall in Mumbai, Gujarat

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పినరయి విజయన్, పళని స్వామితోపాటు లక్ష దీవుల పాలనాధిపతి ఫరూక్ ఖాన్‌తో మాట్లాడారు. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కూడా ఓఖీ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షిస్తోంది.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కేరళలో పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు హరియాణా ప్రభుత్వం రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది.

English summary
Rain started to drench Mumbai on Monday evening as cyclonic storm Ockhi is just 670 kms southwest of the city. The Maharashtra government has announced holiday for schools and colleges on Tuesday as a precautionary measure. The Cyclone is also expected to make landfall in coastal Gujarat with squally winds, which may cause heavy rains in several parts of the state during the next two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X