రజనీకాంత్ వస్తే నాకేం భయం: విజయ్ కాంత్, పాపం నడవలేని స్థితిలో క్యాప్టెన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/మదురై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, భారతీయులకు ఆ హక్కు ఉందని విజయ్ కాంత్ చెప్పారు.

మదురై సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న విజయ్ కాంత్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది కదా, మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రశ్నించింది. రజనీకాంత్ రాజకీయాల్లో రావాలనుకుంటే రానివ్వండి అని విజయ్ కాంత్ సమాధానం ఇచ్చారు.

నాకేం భయం లేదు

నాకేం భయం లేదు

రజనీకాంత్ వస్తే మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని, మా నాయకులు, మా కార్యకర్తలు మాకుంటారని, ఆయన కారణంగా మాకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని విజయ్ కాంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవ్వరైనా రాజకీయాల్లోకి వచ్చే స్వేచ్చ ఉందని విజయ్ కాంత్ గుర్తు చేశారు.

డబుల్ ఢమాకా కాదు త్రిబుల్ !

డబుల్ ఢమాకా కాదు త్రిబుల్ !

గత శాసన సభ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఒక్క ఓటు వేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారని అన్నాడీఎంకే పార్టీని ఎద్దేవ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని విరుచుకుపడ్డారు. గతంలో మీరు అన్నాడీఎంకేకి మద్దతు ఇచ్చారు కదా అంటే ఆ రోజులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అంటూ విజయ్ కాంత్ సమర్థించుకున్నారు.

విజయ్ కాంత్ ఆరోగ్యం !

విజయ్ కాంత్ ఆరోగ్యం !

విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగుపడలేదని వెలుగు చూసింది. ఆయన స్వయంగా నడవలేని పరిస్థితో ఉన్నారు. ఇద్దరి సహాయంతో ఆయన నడవగలుగుతున్నారు. చాల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రజనీకాంత్ వస్తే క్యాప్టెన్ కు ఎదురు దెబ్బ

రజనీకాంత్ వస్తే క్యాప్టెన్ కు ఎదురు దెబ్బ

రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తే విజయ్ కాంత్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సినీరంగంలో తిరుగులేని వ్యక్తి అయిన రజనీకాంత్ పలు పార్టీల నాయకులు, కార్యకర్తలను తన వైపు తిప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ఆమె పార్టీకి దిక్కు

ఇక ఆమె పార్టీకి దిక్కు

విజయ్ కాంత్ అనారోగ్యంతో చాల రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ డీఎండీకే పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని డీఎండీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DMDK President Vijayakanth says that Rajini's political entry didn't affect his party's functionaries and in democratic country everyone has the rights to enter into politics.
Please Wait while comments are loading...