ఊహించని దెబ్బకొట్టారు, బీజేపీకి షాక్: మోడీ వ్యూహం రివర్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం రివర్స్ అయిందా? ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయాలన్న ఆయన ప్లాన్ ఫలించలేదా? అంటే అవుననే అంటున్నారు. డీఎంకేపై ఆయన వ్యూహం ఫలించలేదని అంటున్నారు.

  GST Council Set To Announce Big Tax Cut, 200 Items Get Cheaper

  కొద్ది రోజుల క్రితం బీహార్‌లో కాంగ్రెస్ - జేడీయు - ఆర్జేడీ మిత్రపక్షం ముక్కలయింది. ఇప్పుడు బీహార్‌లో బీజేపీ - జేడీయు ప్రభుత్వం ఉంది. అయితే వారి మధ్య చిచ్చుకు ఆ పార్టీల మధ్య విభేదాలను బీజేపీ అందిపుచ్చుకొని చక్రం తిప్పింది. ఇందులో బీజేపీ ప్లాన్ ఫలించింది.

  ఫలించని బీజేపీ వ్యూహం

  ఫలించని బీజేపీ వ్యూహం

  అయితే, తమిళనాడులో బీజేపీ వ్యూహం ఏమాత్రం ఫలించలేదని అంటున్నారు. నవంబర్ 8 నాటికి నోట్ల రద్దు ప్రకటనకు ఏడాది అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ సంబరాలు చేసుకుంటే, విపక్షాలు బ్లాక్ డేగా పరిగణించాయి.

  కరుణానిధిని కలిసిన మోడీ

  కరుణానిధిని కలిసిన మోడీ

  నవంబర్ 8కి ముందు రోజు ప్రధాని మోడీ చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. ఆ వెంటనే నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలనుకున్న డీఎంకే వాటిని విరమించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

   నిన్న బీహార్, నేడు తమిళనాడు!

  నిన్న బీహార్, నేడు తమిళనాడు!

  దీంతో నిన్న బీహార్‌లో నేడు తమిళనాడులో మోడీ విపక్షాలను దెబ్బతీయడంలో విజయం సాధించారని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై నిరసన తెలపవద్దని డీఎంకే నిర్ణయించుకోవడం మోడీ విజయంగా చెప్పారు. తమిళనాడులో భారీ వర్షాలతో జనం ఇబ్బంది పడుతుంటే నిరసనలు సరికాదని డీఎంకే ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.

   ఊహించని షాకిచ్చిన స్టాలిన్

  ఊహించని షాకిచ్చిన స్టాలిన్

  అయితే, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా స్టాలిన్, డీఎంకే వర్గాలు నిరసన చేపట్టాయి. ఇది బీజేపీ వర్గాలకు షాకిచ్చింది. విపక్షాలను దెబ్బతీయడంలో మోడీ మరోసారి విజయం సాధించారని అందరూ భావించినప్పటికీ, ఆ ఆశలపై స్టాలిన్ నీళ్లు చల్లారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As Prime Minister Narendra Modi met DMK patriarch M Karunanidhi on Monday, social media was abuzz with

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి