Doute: భార్య మీద విపరీతమైన ?, భార్యను చంపేసి అత్తకు ఫోన్ చేసిన అల్లుడు, మామ ఎంట్రీతో, ఫినిష్ !
జమ్మూ కాశ్మీర్: వ్యాపారం చేస్తున్న యువకుడితో మా అమ్మాయి పెళ్లి చేస్తే ఆమె సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లు ఆ యువకుడి, యువతి వివాహం జరిపించేశారు. పెళ్లి చేసుకున్న భార్య ఆమె భర్త ఇంటికి వెళ్లింది. భర్త ఇంటికి వెళ్లిన యువతి కొన్ని నెలల పాటు ఆమె భర్తతో సంతోషంగా ఉందని తెలిసింది. తరువాత మొబైల్ చేతిలో పట్టుకుంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని వేదించడం, ఇంటి ముందు నిలబడితే ఎవరి కోసం చూస్తున్నావు అంటూ భర్త మీద అనుమానంతో ఆమెను భర్త టార్చర్ పెట్టాడని తెలిసింది. భర్తతో పాటు అత్తమామలు కూడా చిత్రహింసలకు గురి చెయ్యడంతో బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పింది. పెద్దలు రెండుమూడు సార్లు పంచాయితీలు చేసి దంపతులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. భార్య ఇంటికి ఫోన్ చేసిన భర్త మీ అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అల్లుడు, అతని తల్లిదండ్రుల మీద కేసు పెట్టారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే కంత్రీ మొగుడు మ్యాటర్ మొత్తం బయటకు చెప్పాడు.

వ్యాపారం చేస్తున్న పవన్
జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో పవన్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాంబన్ జిల్లాలోని పాశ్వాల్ ధరల్లా గ్రామంలో నిషుదేవి అలియాస్ దేవి (23) అనే యువతి నివాసం ఉంటున్నది. పవన్ కుమార్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న పవన్ కుమార్ తో మా అమ్మాయి నిషు దేవి పెళ్లి చేస్తే ఆమె సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.
2. అందరివాడు

హ్యీపీగా పెళ్లి చేసుకున్నారు
పెద్దలు ముందుగా మాట్లాడుకున్నట్లు గత ఏడాది పవన్ కుమార్, నిషు దేవిల వివాహం జరిపించేశారు. పవన్ కుమార్ ను పెళ్లి చేసుకున్న నిషు దేవి ఆమె భర్త ఇంటికి వెళ్లింది. భర్త పవన్ కుమార్ ఇంటికి వెళ్లిన నషు దేవి కొన్ని నెలల పాటు ఆమె భర్తతో సంతోషంగా ఉందని, తరువాత ఆమెకు కష్టాలు ఎదరైనాయని తెలిసింది.

శాడిస్టు మొగుడి ప్రశ్నలతో ?
రానురాను పవన్ కుమార్ అతని భార్య నిషు దేవికి సినిమా చూపించడం మొదలుపెట్టాడు. భార్య నిషు దేవి మొబైల్ చేతిలో పట్టుకుంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని వేదించడం, ఇంటి ముందు ఆమె నిలబడితే ఎవరి కోసం చూస్తున్నావు అంటూ ఆమెను భర్త పవన్ కుమార్ టార్చర్ పెట్టాడని తెలిసింది.

సర్దుకుపోదామని అనుకున్న భార్య
భర్త పవన్ కుమార్ తో పాటు అత్తమామలు కూడా చిత్రహింసలకు గురి చెయ్యడంతో బాధితురాలు నిషు దేవి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పింది. పెద్దలు రెండుమూడు సార్లు పంచాయితీలు చేసి పవన్ కుమార్, నిషు దేవి దంపతులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. తన భర్త పవన్ కుమార్ ఎప్పటికైనా మారుతాడని నిషు దేవి ఆశగా ఎదురు చూసింది.

భార్య ఆత్మహత్య చేసుకుందని అత్తకు ఫోన్ చేసిన అల్లుడు
జనవరి 23వ తేదీన పవన్ కుమార్ అతని భార్య నిషు దేవి ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కూతురు నషు దేవి ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. మా అల్లుడు పవన్ కుమార్, అతని తల్లిదండ్రులు నిషు దేవిని చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

చిక్కిపోయిన భర్త
రాంబన్ జిల్లా పోలీసులు పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే కంత్రీ మొగుడు మ్యాటర్ మొత్తం బయటకు చెప్పాడు. తన భార్య నిషు దేవిని గొంతు నులిమి చంపేశానని, కేసు నుంచి తప్పించుకోవాలని ఆమెకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పవన్ కుమార్ అంగీకరించాడు.

పోలీసులు, డాక్టర్ కు లంచం ఇచ్చి ?
పోస్టుమార్టుం చేసిన వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన పవన్ కుమార్ ఆమె అత్మహత్య చేసుకుందని డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పాడని, అరెస్టు చెయ్యకుండా పోలీసులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడని పోలీసు అధికారులు తెలిపారు. పవన్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications