వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ప్రయోగం విజయవంతం (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గురువారం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని మిలిటరీ ఇన్‌స్టాలేషన్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్-గైడెడ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ATGM)ని విజయవంతంగా పరీక్షించింది.

లేజర్ గైడెడ్ ATGMని విజయవంతంగా ప్రదర్శించినందుకు డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. లేజర్ గైడెడ్ ATGM టెస్ట్ ఫైరింగ్‌లో పాల్గొన్న బృందాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, DRDO చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అభినందించారు.

"దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్-గైడెడ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను DRDO, ఇండియన్ ఆర్మీ మెయిన్ బాటిల్ ట్యాంక్ (MBT) అర్జున్ నుంచి విజయవంతంగా ప్రయోగించాయి' అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

DRDO Successfully Test Fires Laser-Guided Anti-Tank Guided Missiles

ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్, స్కూల్ మద్దతుతో అహ్మద్‌నగర్‌లోని కెకె రేంజ్‌లో క్షిపణుల పరీక్షా కాల్పులు జరిగాయి.

'క్షిపణులు ఖచ్చితత్వంతో ఢీకొని రెండు వేర్వేరు పరిధుల్లోని లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. టెలిమెట్రీ వ్యవస్థలు క్షిపణుల సంతృప్తికరమైన విమాన పనితీరును నమోదు చేశాయి' అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఆల్-ఇండిజినస్ లేజర్ గైడెడ్ ATGM పేలుడు రియాక్టివ్ ఆర్మర్ (ERA) రక్షిత సాయుధ వాహనాలను ఓడించడానికి టెన్డం హై ఎక్స్‌ప్లోసివ్ యాంటీ ట్యాంక్ (HEAT) వార్‌హెడ్‌ను ఉపయోగిస్తుంది" అని తెలిపింది.

క్షిపణులు ఖచ్చితత్వంతో దాడి చేసి రెండు వేర్వేరు పరిధుల్లోని లక్ష్యాలను విజయవంతంగా చేధించాయి. ఆల్-ఇండిజినస్ లేజర్ గైడెడ్ ATGM ఎక్స్‌ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్ (ERA) సాయుధ వాహనాలను నాశనం చేయడానికి టెన్డం హై ఎక్స్‌ప్లోసివ్ యాంటీ-ట్యాంక్ (HEAT) వార్‌హెడ్‌ను ఉపయోగిస్తుంది.

ATGM బహుళ-ప్లాట్‌ఫారమ్ ప్రయోగ సామర్థ్యంతో అభివృద్ధి చేయబడింది, ప్రస్తుతం MBT అర్జున్ 120 mm రైఫిల్డ్ గన్‌తో సాంకేతిక మూల్యాంకన ట్రయల్స్‌లో ఉంది.

English summary
DRDO Successfully Test Fires Laser-Guided Anti-Tank Guided Missiles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X