ఇస్లామాబాద్ భారత హై కమిషనర్ కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం .. పాక్ తీరుపై భారత్ తీవ్ర ఆందోళన

ఇస్లామాబాద్లోని భారత హై కమిషనర్ కార్యాలయం వద్ద ఒక డ్రోన్ సంచరించడం తీవ్ర కలకలం రేపుతుంది. గత వారం భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్లతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో తాజాగా ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ కార్యాలయం వద్ద కూడా డ్రోన్ తిరగడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

 ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర డ్రోన్ కలకలం

ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర డ్రోన్ కలకలం

పాకిస్తాన్ ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయం సమీపంలో గత ఆదివారం నాడు ఒక డ్రోన్ కనిపించింది. దీంతో భద్రతా ఉల్లంఘనపై భారతదేశం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.మిషన్‌లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో డ్రోన్ కాంప్లెక్స్ లోపల కనిపించిందని, దీనిని భద్రతా ఉల్లంఘనగా పేర్కొంటూ, ఈ సంఘటనపై భారతదేశం దౌత్య కరస్పాండెన్స్ ద్వారా నిరసన తెలిపిందని సమాచారం. భారతదేశంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) దళాలు శుక్రవారం తెల్లవారుజామున జమ్మూలోని ఆర్నియా సెక్టార్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ నుండి ఒక డ్రోన్ గుర్తించి, దానిపై కాల్పులు జరిపి, దానిని తిప్పికొట్టారు. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన

భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన

జమ్మూ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు డ్రోన్ ను తిప్పి కొట్టిన జరిగిన కొన్ని గంటల్లోనే భారత హై కమిషన్ కార్యాలయం పై కూడా డ్రోన్ సంచరించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్న వార్తలు బయటకు వచ్చాయి. భారత వైమానిక దళ స్థావరంపై ఆదివారం జరిగిన డ్రోన్ దాడుల్లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం పాకిస్తాన్ మద్దతుతోనే , పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులైన జైష్-ఎ-మొహమ్మద్ మరియు లష్కర్-ఎ- తోయిబా ప్రమేయంతో 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పాకిస్తాన్ వైఖరిపై భారత్ ఆగ్రహంతో ఉంది.

 మరో భద్రతా ఉల్లంఘన .. పాక సర్కార్ పై ఫైర్ అవుతున్న భారత్

మరో భద్రతా ఉల్లంఘన .. పాక సర్కార్ పై ఫైర్ అవుతున్న భారత్

మరో పెద్ద భద్రతా ఉల్లంఘనలో భాగంగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ప్రాంగణంలో ఒక డ్రోన్ కనిపించింది.

భద్రతా ఉల్లంఘనపై ఇస్లామాబాద్‌ రాయబార కార్యాలయంతో భారత్ ఈ విషయంలో దర్యాప్తు చేస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం లోపల డ్రోన్ కనిపించిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది భారత్. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళ స్టేషన్‌లో బాంబు దాడి చేసిన తరువాత ఈ డ్రోన్ల వ్యవస్థపై దృష్టి సారించింది భారత్ .

డ్రోన్ లతో భారత భద్రతా వ్యవస్థపై ఉగ్రవాదుల నిఘా .. సహకరిస్తున్న పాక్

డ్రోన్ లతో భారత భద్రతా వ్యవస్థపై ఉగ్రవాదుల నిఘా .. సహకరిస్తున్న పాక్

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు మానవరహిత డ్రోన్ లను ఉపయోగించారని భారత భద్రతా వ్యవస్థ పై నిఘా పెట్టారని , ఏకంగా భారత హై కమిషన్ కార్యాలయం పైనే దృష్టి పెట్టారని తాజా పరిణామాలతో అర్థమౌతుంది. ఇందులో పాకిస్తాన్ కుట్ర ఉందని, దీని వెనుక పాక్ ప్రభుత్వ మద్దతు ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+