వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 నెలలకే పడిపోతున్న యాంటిబాడీలు.. కింకర్తవ్యం... బూస్టర్ డోసేనా..?

|
Google Oneindia TeluguNews

కరోనాకు శ్రీరామరక్ష వ్యాక్సినే.. అందరూ తీసుకుంటున్నారు. టీకాల గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. కొవిడ్ పూర్తి డోసులు తీసుకున్న హెల్త్ వర్కర్లలో భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోయాయని స్టడీ చెప్తుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న 614 మంది హెల్త్ వర్కర్లలో తగ్గిపోవడంతో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. దీనిని బట్టి యాంటీబాడీలు తగ్గిపోతే జబ్బు నుంచి తట్టుకుని ఉండలేమనే అపోహ వద్దు.. బాడీ మొమరీ సెల్స్ గణనీయమైన రక్షణ అందించి కాపాడతాయని స్టడీలో వెల్లడైందని డైరక్టర్ అన్నారు.

ఆరు నెలల తర్వాత గానీ బూస్టర్ డోస్ కావాలా వద్దా అని స్పష్టంగా చెప్పలేమని భువనేశ్వర్ లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సంఘమిత్ర పతి చెబుతున్నారు. పాన్ ఇండియా డేటాను బట్టి.. పలు ప్రాంతాల్లో మరిన్ని స్టడీలు నిర్వహించాలనుకుంటున్నాం అని వెల్లడించారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ఆరు నెలల్లోనే పనితనం కోల్పోతాయని బ్రిటీష్ రీసెర్చర్లు వెల్లడించారు. స్క్వేర్ ప్రింట్ ప్లాట్‌ఫాం రీసెర్చ్ స్టడీలో ఇది పబ్లిష్ అయింది. ఇందులో కొవీషీల్డ్, కొవాగ్జిన్ పై కూడా స్టడీ జరిగింది. ఇండియాలో మొత్తం 944 మిలియన్ మందికి పూర్తి డోసులు అందాయి. 60శాతం మంది ఒక డోస్ తీసుకోగా.. 19శాతం మంది రెండు డోసులు తీసుకోవాల్సి ఉంది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

 drop in antibodies within 4 months after covid dose

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
drop in antibodies within 4 months after covid dose study revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X