• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రమోషన్లు, జీతాల కోసం ఎక్కువ పనిచేస్తున్నారా?: ఐతే మీ జీవితానికి మీరే చరమగీతం పాడేస్తున్నారు!

|
  Employees who put in too much effort, perform worse... study says

  లండన్‌: ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీదారుణంగా తయారైంది. ఉద్యోగాలను కాపాడుకోవడంతోపాటు ప్రమోషన్లు, వేతనాల పెంపు కోసం శక్తికి మించి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాము పనిచేస్తున్న కంపెనీల కోసం కష్టించి పనిచేస్తే ప్రమోషన్లు, జీతాల పెంపు ఏమో గానీ.. మీ జీవితం, ఆరోగ్యానికి పెను ముప్పు అంటూ తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

   అసంతృప్తి, నిరాశ

  అసంతృప్తి, నిరాశ

  ఉద్యోగ బాధ్యతల్లో అదనపు శ్రమతో పనిచేసేవారు అనారోగ్యాలకు గురికావడంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమోషన్లు దక్కలేదనే అసంతృప్తి, నిరాశలోకి కూరుకుపోతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, ఈఎస్‌సీపీ యూరప్‌ బిజినెస్‌ స్కూల్‌ చేపట్టిన అథ్యయనం పేర్కొంది.

  యాజమాన్యాలే మారాలి..

  యాజమాన్యాలే మారాలి..

  యాజమాన్యాలు ఉద్యోగులను ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తూ వారికి అనువైన సమయాల్లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తే మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగుల నుంచి కంపెనీ పట్ల ఆదరణ పెరుగుతాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

  36 ఐరోపా దేశాలకు చెందిన 52,000 మంది ఉద్యోగులను రెండు దశాబ్దాల పాటు పరిశోధక బృందం పరిశీలించిన మీదట ఈ వివరాలు వెల్లడించింది.

  పని ఒత్తిడి, డెడ్‌లైన్ల ప్రభావంతో..

  పని ఒత్తిడి, డెడ్‌లైన్ల ప్రభావంతో..

  పని ఒత్తిడి, డెడ్‌లైన్లు వంటివి ఉద్యోగుల పనితీరును దెబ్బతీస్తున్నాయని అధ్యయన రచయిత డాక్టర్‌ ఆర్గ్యో అస్తోకి తెలిపారు. పనితీవ్రత పని నాణ్యతను కూడా ప్రభావితం చేస్తోందని ఫలితంగా ఉద్యోగులు ఎంత కష్టపడినా ప్రమోషన్లు దక్కడం లేదని స్పష్టం చేసింది. పనితీవ్రతను, అధిక పనిగంటలను నివారిస్తేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

  విరామం తప్పనిసరి

  విరామం తప్పనిసరి

  చాలా వృత్తుల్లో ఎక్కువ పనిచేసేందుకు సిబ్బంది మధ్యలో విరామం తీసుకోవడాన్ని విస్మరిస్తున్నారని, అయితే బ్రేక్స్‌ తీసుకోవాలని తాము వారికి సూచిస్తున్నామని తెలిపారు. విరామం తీసుకోకుండా పనిచేస్తే ఉద్యోగుల ఆరోగ్యం కూడా ఘోరంగా దెబ్బ తింటుందని హెచ్చరించారు. పనిలో విరామం అనేది తప్పనిసరి అని తెలిపారు. లేదంటే అసలు జీవితంపై తీవ్ర ప్రభావం పడి ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  మరిన్ని employees వార్తలుView All

  English summary
  We are told that hard work can lead to more promotions, a higher pay raise and general overall happiness. But a new study has revealed that working too hard is not just bad for your overall health, but also for your career path.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more