ఇన్ఫోసిస్‌లో కలకలం: వైస్ ప్రెసిడెంట్ రితికా సూరి రాజీనామా
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ రితికా సూరి రాజీనామా చేశారు.
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ రితికా సూరి రాజీనామా చేశారు. కాగా, ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈఓగా కొనసాగుతున్న సీఈఓ విశాల్ సిక్కాకు ఈ రాజీనామాలు సవాల్‌గా మారుతున్నాయి.

రితికా సూరి రాజీనామా కలకలం
ఇజ్రాయిలీ ఆటోమేషన్ కంపెనీ ‘పనాయా' విలీన ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితికా. ముఖ్యంగా మొబైల్ సంస్థ స్కవా, పనాయా ఒప్పందంలో ఎలాంటి లోపాలు కనబడలేదని తేల్చిన అనంతరం ఆమె రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. అయితే, ఈ వార్తను ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఆ వెంటనే..
కాగా , ఇన్ఫోసిస్ లిమిటెడ్‌లో భారీ ఒప్పంద బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విలీనం, స్వాధీనాలకు సంబంధిత కీలక బాధ్యతలను స్వీకరించిన రితికా.. పనాయాతో సహా రెండు కీలక ఒప్పందాలకు ఇన్ఫీ అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

సిక్కా హయాంలో రాజీనామాల పర్వం
ఇటీవల అమెరికాకు చెందిన న్యాయ సంస్థ చేసిన దర్యాప్తులో పనాయా, మొబైల్ కామర్స్ సంస్థ స్కవాతో సహా రెండు కంపెనీలు కొనుగోలు చేయాలనే విషయంలో మేనేజ్‌మెంట్ నిర్ణయంలో ఎటువంటి దోషమూ లేదని తేల్చింది. కాగా, ఆగస్టు 2014లో విశాల్ సిక్కా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక ఎగ్జిక్యూటివ్ సందీప్ దాద్లానీ, తాజాగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సూరి సహా, ఇంకా 10మంది కార్యనిర్వాహకులు ఇన్ఫోసిస్ నుంచి వైదొలగడం గమనార్హం. అయితే, విశాల్ సిక్కానే తనతోపాటు ఎస్ఏపీ నుంచి ఇన్ఫోసిస్‌కు రితికాను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

నారాయణ మూర్తి పశ్చాత్తాపం
తాజాగా, తాను ఇన్ఫోసిస్ నుంచి వెళ్లిపోయి తప్పు చేశానని సహా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పేర్కొనడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలు చేశారు. 2014లో కంపెనీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగినందుకు విచారిస్తున్నానని పేర్కొన్నారు. ఇతర సహ వ్యవస్థాపకుల మాట విని.. ఆ పదవిలో కొనసాగి ఉంటే బాగుండేదని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా తాను పశ్చాత్తాప పడాల్సిన విషయం అదేనని అన్నారు. అయితే ఇన్ఫోసిస్ ప్రాంగణంలో అడుగు పెట్టకుండా ఎపుడూ ఉండలేదని స్పష్టం చేశారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications