వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘యు ఆర్ ద బాంబర్’: బెంబేలెత్తిన ప్యాసెంజర్స్.. ప్లైట్ 6 ఆవర్స్ లేట్

|
Google Oneindia TeluguNews

బస్సు, రైలుకు బెదిరింపులు వస్తే అంతే.. ఇక విమానాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును థ్రెట్ కాల్ వచ్చినా.. బాంబ్ ఉందని సమాచారం వస్తే అంతే సంగతులు.. నిన్న అలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే థ్రెట్ కాల్ కాకుండా.. చాట్ చూసి ఓ ప్యాసెంజర్ నానా హంగామా చేశారు. క్రూ సిబ్బందికి చెప్పడం.. వారు ప్లైట్ నిలిపివేశారు. అలా ఏకంగా 6 గంటలపాటు విమానం ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం ఆరా తీస్తే ఆసలు విషయం తెలిసింది.

‘యు ఆర్ ద బాంబర్'

‘యు ఆర్ ద బాంబర్'

మంగళూరు నుంచి ముంబైకి ఇండిగో విమానం నిన్న మధ్యాహ్నం బయల్దేరాల్సి ఉంది. విమానం బయల్దేరడానికి సిద్దంగా ఉంది. ఇంతలో ఓ యువకుడు, తన లవర్‌తో చాట్ చేస్తున్నాడు. ఆమె కూడా మరో విమానంలో ముంగళూర్ నుంచి బెంగళూరు వెళుతున్నారు. అయితే అందులో ఆమె సరదాగా 'యూ ఆర్ ద బాంబర్' అని రాసింది. ఆ టెక్ట్స్ మేసెజ్ పక్కన ఉన్న మరో ప్యాసెంజర్ కంటపడింది. ఇంకేముంది భయపడింది. వెంటనే విమాన క్రూ సిబ్బందికి తెలిపింది. ఎగిరే సమయంలో ఎమర్జెన్సీ కాల్ రావడంతో ఆపివేశారు.

 యువకుడి విచారణ

యువకుడి విచారణ


తర్వాత బాంబర్ విషయం గురించి తెలిసి ఆ యువకుడిని విచారించారు. ప్రయాణికుల బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు. చివరకు తన గర్ల్ ఫ్రెండ్‌తో చాట్ విషయం చెప్పగా.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అతనిని అనుమతించారు. అలా విమానం ఏకంగా 6 గంటల పాటు ఆలస్యమైంది. వారు ఏదో సరదాగా చేస్తే అదీ సీరియస్ ఇష్యూ అయ్యింది.

కేసు నమోదు

కేసు నమోదు


తర్వాత విషయం గురించి పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఘటనపై 505 1బీ, సీ సెక్షన్ల కింద బాజ్పే పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళూర్ నుంచి వెళ్లాల్సిన విమానంలో యువకుడు బయల్దేరారు.. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం విచారణ చేయడంతో.. ఆమె బెంగళూరు ప్లైట్ మిస్సయ్యింది. ఆ తర్వాత ఇండిగో విమానం 185 మంది ప్రయాణికులతో బయల్దేరింది.

English summary
Mangaluru-Mumbai flight was delayed by six hours after passengers were asked to deboard the aircraft and the flight was intensely checked for any sabotage on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X