వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి: ఎప్పుడు, ఎలా చేశారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై తమ సైన్యం దాడి చేసిన విషయాన్ని భారత్ అకస్మాత్తుగా గురువారంనాడు ప్రకటించింది. ఈ దాడుల్లో దాదాపు 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.

యురిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చిన ఘటన జరిగిన 11 రోజులకు భారత్ తన యుద్ధనీతిని ప్రదర్శించింది. యురి ఘటనను క్షమించబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కూడా ప్రకటించారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై ఇలా దాడి చేసింది.

‘Forces went deep in Pak, came back before sunrise’: How strikes were conducted

* వివిధ సెక్టార్లలోని 8 టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్‌పై భారత సైన్యం గురి పెట్టింది.

* సరిహద్దు దాటి భారత సైనికులు పాకిస్తాన్‌లో 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లారు.

* దాడులు బుధవారం అర్థరాత్రి ప్రారంభమై గురువారం తెల్లవారు జామున గం.4.30 నిమిషాలకు ముగిశాయి.

* జమ్మూ కాశ్మీర్‌లోనూ భారత దేశంలోని మెట్రో నగరాల్లోనూ దాడులు చేయడానికి సిద్ధపడిన ఉగ్రవాదులను, వారి గైడ్స్‌ను, హ్యాండిలర్స్‌ను భారత సైనికులు మట్టుబెట్టారు.

* భారత సైనికుల దాడిలో 38 మంది ఉగ్రవాదులతో పాటు ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.

* ఆపరేషన్‌లోకి వైమానిక బలగాలు మాత్రమే కాకుండా కాల్బలం కూడా దిగాయి.

అత్యంత వేగంగా నిర్దిష్టమైన స్థావరాలను గురి పెట్టి ఈ దాడులు జరిగాయి. పరిసరా ప్రాంతాలు విధ్వంసం కాకుండా పౌరులకు నష్టం వాటిల్లకుండా ఈ దాడులు జరిగాయి. యుద్ధవాతావరణం నెలకొందనే భావనను కలిగించకుండా ఈ దాడులు జరిగాయి.

English summary
India carried out 'surgical strikes' on terror launch pads across the Line of Control (LoC) in Jammu and Kashmir last night, inflicting "significant casualties" on terrorists and those who are trying to support them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X