హైదరాబాద్‌లో రూ.100 దాటిన పెట్రోల్: విజయవాడలో ఇంకా పైపైకి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు దయాదాక్షిణ్యాలనేవి లేకుండా వ్యవహరిస్తోన్నట్లు కనిపిస్తోంది. రేట్లను పెంచడంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. ఇంధన ధరలను పెంచడమే తమ ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నట్టున్నాయి. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. ఒకట్రెండు చోట్ల డీజిల్ కూడా ఆ మార్క్‌ను అందుకుంది. తాజాగా 100 రూపాయల క్లబ్‌లో హైదరాబాద్ కూడా చేరింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 29 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.96.41, డీజిల్ 87.28 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 102 మార్క్‌ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.102.58 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 94.70కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 97.69, డీజిల్ ధర రూ. 91.92, కోల్‌కతలో పెట్రోల్ రూ.96.34 పైసలు, డీజిల్ ధర రూ.90.12 పైసలు పలుకుతోంది.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.20 పైసలుగా నమోదైంది. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.95.14 పైసలు. విజయవాడలో ఈ రేటు మరింత అధికంగా ఉంది. అక్కడ పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.102.66 పైసలకు చేరింది. డీజిల్ ధర రూ.95.41 పైసలుగా రికార్డయింది. విశాఖపట్నంలో పెట్రోల్ రేటు రూ.101.35 పైసలు, డీజిల్ ధర రూ.95.41 పైసలు పలుకుతోంది. ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటేసింది. భోపాల్‌లో పెట్రోల్-104.59, డీజిల్-95.91 రూపాయలకు చేరింది. రాంచీలో పెట్రోల్ రూ.92.51, డీజిల్ 92.13. బెంగళూరులో పెట్రోల్ రూ.99.63, డీజిల్ 92.52, పాట్నాలో పెట్రోల్ రూ.98.49 పైసలు, డీజిల్ రూ.92.59 పైసలు,చండీగఢ్‌లో పెట్రోల్ రూ.92.73, డీజిల్ రూ.86.92, లక్నోలో పెట్రోల్ రూ.93.63, డీజిల్ రూ.87.68 పైసలు పలుకుతోంది.
నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో 102 రూపాయలకు పైగా దీని ధర చేరగా.. రత్నగిరి, పర్భణీ, ఔరంగాబాద్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్‌వారా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్‌మగళూరు, శివమొగ్గ, దావణగెరె వంటి చోట్ల వంద రూపాయలను దాటేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications