వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను గుజరాత్ కొడుకు: నా తల్లి దగ్గరకు వచ్చి ఆరోపణలు చేస్తారా ? రాహుల్ మీద మోడీ ఫైర్ !

గుజరాత్ నా తల్లి, నేను కుమారుడిని, ప్రధాని నరేంద్ర మోడీనా తల్లి దగ్గరకు వచ్చి నా మీదే ఆరోపణలు చేస్తారా, గుజరాతీలు క్షమించరుడోక్లమ్, చైనా రాయబారిని ఎందుకు కౌగిలించుకున్నారు, రాహుల్ గాంధీ మీద నరేంద్ర

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ బిజీ అయ్యారు. గుజరాత్ లో జరుగుతున్న ఎన్నికలు అభివృద్ది, వారసత్వ రాజకీయాల మధ్య పోరాటం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. సోమవారం గుజరాత్ లోని కచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.

ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మట్లాడుతూ తనపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. గుజరాత్‌ తనకు తల్లి లాంటిదని, తాను ఆమె బిడ్డనని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ బిడ్డగా రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చా లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

Gujarat is my mother and Iam her son: PM Naredra Modi

మీరు మా రాష్ట్రంలో అడుగుపెట్టి ఇక్కడి బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే గుజరాతీలు మిమ్మల్ని క్షమించరని, ఇలాంటి విమర్శలు మీకే మంచిదికాదని ప్రధాని నరేంద్ర మోడీ యువరాజు రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. రెండునెలలకు పైగా భారత సైనికుులు డోక్లాంలో కంటిమీద కునుకులేకండా విధులు నిర్వహిస్తే చైనా రాయబారిని రాహుల్ గాంధీ ఎందుకు కౌగిలించుకున్నారో చెప్పాలని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.

గుజరాత్‌ ర్యాలీల్లో రాఫెల్‌ యుద్ధ విమానాల డీల్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్‌ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ తన మీద చేసిన విమర్శల్లో ఏమాత్రం పసలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో కచ్చితంగా 151 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. గుజరాత్ లోని సౌరాష్ర్ట, దక్షిణ గుజరాత్‌లో ప్రధాని పలు ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.

English summary
Appealing to the Gujarat electorate as son of the state, Prime Minister Narendra Modi on Monday lashed out at the opposition Congress, saying that people of the state would not forgive those who are insulting the son of Gujarat" who has never had a single blot on his political career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X