
ముంబైలో దంచికొడుతున్న వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు, రైల్వే ట్రాక్స్ పైకి నీళ్ళు.. అలెర్ట్ !!
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రైల్వే ట్రాక్ పైన కూడా నీరు చేరడంతో, లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరదలో
చిక్కుకున్న
టీఆర్ఎస్
ఎమ్మెల్యే
సుధీర్
రెడ్డి
కారు..
అధికార
పార్టీ
ఎమ్మెల్యేకు
తప్పని
తిప్పలు
గాంధీ మార్కెట్ ప్రాంతం, హింద్ మాతా జంక్షన్ మరియు దహిసర్ సబ్వేతో సహా అనేక ప్రదేశాలలో రహదారుల పైన నీళ్ళు చేరడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముంబైలోని సియోన్, బాంద్రా, అంధేరి మరియు శాంటాక్రూజ్ ప్రాంతాలలోనూ భారీగా వరద నీరు చేరుకుంది. సియోన్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాకులు నీటిలో మునిగి పోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో వందలాది మంది ప్రయాణికులు రైల్వే ప్లాట్ ఫాం పైన రైళ్ల కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు.

ఈరోజు
ఉదయం
8:30
గంటలకు
అందిన
నివేదికల
ప్రకారం
గత
24
గంటల
వ్యవధిలో
ముంబై
నగరంలో
64.45
మిల్లీమీటర్ల
వర్షపాతం
నమోదైంది.
తూర్పు
శివారు
ప్రాంతాలు
120.67
మిమీ,
పశ్చిమ
శివారు
ప్రాంతాలు
127.16
మిమీ
వర్షపాతం
నమోదైనట్లు
గా
తెలుస్తుంది
.
రాబోయే
మూడు
గంటల్లో
ముంబైలో
భారీ
నుంచి
అతి
భారీ
వర్షాలు
కురుస్తాయని
భారత
వాతావరణ
శాఖ
(ఐఎండి)
తెలిపింది.
ఇక
తీవ్రమైన
వర్షాల
కారణంగా
రైల్వే
ట్రాక్
పైకి
నీళ్లు
చేరడంతో
సెంట్రల్
రైల్వే
మెయిన్
లైన్
(సిఎస్ఎంటి
నుండి
కల్యాణ్
/
కర్జాత్,
కసారా)
మరియు
హార్బర్
లైన్
(సిఎస్ఎంటి
నుండి
పన్వెల్
/
గోరేగావ్)
రైళ్లు
20-25
నిమిషాలు
ఆలస్యంగా
నడుస్తున్నాయని
ప్రకటన
విడుదల
చేశారు.
Recommended Video
రానున్న 24 గంటల్లో ముంబై , ఠానే ,ఇతర మహారాష్ట్ర జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని ఈ మేరకు సూచించింది . ఇక సాయంత్ర సమయంలో ముంబై సముద్ర తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇక చాలా ప్రాంతాలు నీట మునగడంతో వాహన చోదకులకు ప్రయాణ కష్టాలు తప్పటం లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది.