వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈదురు గాలులు.. వర్ష బీభత్సం, ఢిల్లీలో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు

|
Google Oneindia TeluguNews

నైరుతి రుతు పవనాల ఆగమనం.. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురు గాలులు వీచాయి. వర్షం కూడా కురిసింది. వాతావరణం చల్ల బడటంతో జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఈదురు గాలుల‌తో మొద‌లైన వ‌ర్షం న‌ష్టాన్నే మిగిల్చింది. గాలి వాన వల్ల సిటీలోని చాలా ప్రాంతాల్లో పెద్ద చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహ‌నాల‌పై విరిగిప‌డిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

దీంతో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. గాలి వానతో న‌గ‌రంలోని ఏపీ, తెలంగాణ భ‌వ‌న్‌లో వర్ష బీభ‌త్సం కూడా సృష్టించింది. గాలి వాన వల్ల ఏపీ, తెలంగాణ భ‌వ‌న్ ప‌రిధిలో ఉన్న భారీ వృక్షాలు కూలిపోయాయి. కూలిన చెట్లు సిబ్బంది నివాసాల‌పై ప‌డ్డాయి. దీంతో సిబ్బంది నివాస భ‌వ‌నాలు స్వ‌ల్పంగా ధ్వంసం అయ్యాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Heavy rainfall, strong winds bring temperature down in Delhi

ఈదురుగాలులతో భారీ వృక్షాలు నెలరాలాయి. దీంతో విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపింది. కొన్ని ఏరియాల్లో అంధకారం నెలకొంది. పాలంలో 13 డిగ్రీలు, సప్ధార్ జంగ్‌లో 16 డిగ్రీల ఉష్ణోగ్రత.. సాయంత్రం 4.20 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల వరకు ఉంది. సప్దార్ జంగ్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల నుంచి 25 డిగ్రీలకు పడిపోయింది. 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

English summary
Heavy rainfall and gusty winds brought the temperature down by about 16 degrees Celsius in the national capital delhi on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X