ఆయన వెనుక శశికళ వర్గం, నా భర్త ఇలా చేస్తాడనుకోలేదు: దీపా షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై అధినేత్రి దీపా జయకుమార్‌కు భర్త షాకిచ్చారు. దీనిపై దీపా స్పందించారు. తమపై వస్తున్న వదంతుల వెనుక శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని దీపా ఆరోపించారు.

స్థానిక టి నగర్‌లోని తమ నివాసంలో శనివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనను ఆర్కే నగర్‌లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.

deepa jayakumar

తన భర్త వెనుక కొందరు ఉండి అసత్యపు ప్రచారాలను చేయిస్తున్నారన్నారు. ఈ ప్రచారం వెనుకు శశికళ కుటుంబం ఉందని దీపా ఆరోపించారు. ఇలాంటి వదంతులను ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై కార్యకర్తలు నమ్మరాదని కోరారు.

కొత్త పార్టీ పెడతాననే తన భర్త ప్రకటించడాన్ని తాను ఊహించలేదని, ఏది ఏమైనా ఆయన అలా ప్రకటించడం తప్పని తెలిపారు.

తన సొంత మనుషులే తనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరవై కార్యక్రమాల్లో తన భర్త ప్రమేయం ఏమీలేదన్నారు. మరోవైపు, తాను ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will contest in R.K.nagar by poll, says jayalalithaa's nice deepa Jayakumar.
Please Wait while comments are loading...