వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలు ఇవే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

1. అటుకులు, పూలతో చేసిన హైబ్రిడ్ బీర్

అటుకులు, హాప్ అనే పువ్వులతో తయారు చేసిన హైబ్రిడ్ బీరును పోలాండ్‌లో విక్రయించిన తొలి వ్యక్తులుగా ఇద్దరు భారతీయులు చరిత్ర సృష్టించారు.

వారిద్దరూ బీరు తయారు చేసేందుకు యుక్రెయిన్ యుద్ధం ఎలా కారణమైందో బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషి వివరించారు.

భారత్‌కు చెందిన చంద్రమోహన్ పోలాండ్‌లో నివసిస్తారు. ఇండో-పోలిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థలో ఆయన బిజినెస్ రిలేషన్స్ హెడ్‌గా పనిచేసేవారు.

ఒక సంవత్సరం క్రితం ఆయన వద్ద 20 వేల కిలోల రైస్ ఫ్లేక్స్ (అటుకులు)‌ మిగిలిపోవడంతో ఆయన తీవ్రంగా మదనపడ్డారు. తన బిజినెస్ క్లయింట్, సరుకు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో భారీమొత్తంలో అటుకులు ఆయన వద్దే మిగిలిపోయాయి.

భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సంస్థ నుంచి ఈ అటుకులను, తృణధాన్యాల (సీరియల్స్) తయారీ కోసం పోలాండ్‌లోని ఒక వ్యాపారవేత్త దిగుమతి చేసుకునేవారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

బాపట్ల కాలేజీ

2. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లు

ఆహారధాన్యాలకు తీవ్ర కొరతతో అల్లాడిన దశ నుంచి భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం, గోధుమలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంలో అనేక మలుపులున్నాయి. కీలక నిర్ణయాలున్నాయి.

అలాంటి వాటిలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటు కూడా ఒకటి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో తొలుత కోయంబత్తూరులో, తర్వాత నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉన్న బాపట్లలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి.

వ్యవసాయరంగంలో మేలురకం వంగడాల పరిశోధన, సస్యరక్షణలో అవసరమైన మార్పులతో హరిత విప్లవం వంటివి విజయవంతం కావడంతో ఈ వ్యవసాయ కళాశాలలు కీలక పాత్ర పోషించాయి. నేటికీ దేశ వ్యవసాయాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.

బాపట్ల వ్యవసాయ కళాశాల ఏర్పాటై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

విటిలిగో

3. బొల్లి - విటిలిగో: చర్మం మీద వచ్చే తెల్ల మచ్చలకు అందుబాటులో ఉన్న చికిత్సలేంటి?

చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్ల మచ్చలు ఏర్పడడాన్నే విటిలిగో లేదా బొల్లి అంటారు. కొందరి విషయంలో శరీరమంతా ఈ తెల్లమచ్చలు వ్యాపిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరిని ఈ సమస్య వేధిస్తోంది. భారత్‌లో మాత్రం, అత్యధికంగా ప్రతి వంద మందిలో అయిదు నుంచి ఎనిమిది మందికి ఈ సమస్య ఉంది.

ఎక్కువగా ఇరవైలలో ఉన్నప్పుడు బొల్లి మొదలవుతుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. వంశ పారంపర్యంగా కూడా ఇది వస్తుంటుంది.

చర్మంలో ఉండే మెలనోసైట్లు (melanocytes) అని పిలిచే ప్రత్యేక కణాలు మెలనిన్(melanin)ను ఉత్పత్తి చేస్తాయి. మన చర్మం రంగుకు ఈ మెలనినే కారణం. దీని స్థాయిలు తగ్గిపోయినప్పుడు బొల్లి (vitiligo) వస్తుంది. దీని వలన చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. దీని ప్రభావం ముఖ్యంగా చర్మం, వెంట్రుకల మీద కనిపిస్తుంది.

దీనిని కేవలం ఒక అందానికి సంబంధించిన సమస్యగా పరిగణించకూడదు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని కారణంగా శరీరంలోని కొన్ని లేదా చాలా ప్రాంతాలలో మెలనోసైట్ల సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడి (ఆక్సిడేటివ్ స్ట్రెస్) వల్ల మెలనోసైట్లు నాశనం అవడంతో ఈ సమస్య మొదలవుతుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

4. ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థులకు ఏడాదికి రూ.13,500 స్కాలర్‌షిప్

ట్రాన్స్‌జెండ‌ర్లపై నేటికీ స‌మాజంలో వివ‌క్ష కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం వారికి స‌మాన హ‌క్కులు క‌ల్పిస్తూ చ‌ట్టం కూడా తీసుకొచ్చింది.

వారి సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది కూడా. ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థుల‌కు ఏటా రూ.13,500 స్కాల‌ర్‌షిప్ అంద‌జేసే ప‌థ‌కం కూడా వీటిలో ఒకటి.

ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థులకు లేదా ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు వివి మార్గాలలో పుట్టిన పిల్ల‌లకు 9వ త‌ర‌గ‌తి నుంచి వారు ఉన్న‌త విద్య పూర్త‌య్యే వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఏటా ఈ స్కాల‌ర్‌షిప్ అంద‌జేస్తుంది.

ఈ ప‌థ‌కం ఏమిటి? ఎంపిక ప్ర‌క్రియ ఎలా ఉంటుంది? ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలా? స్కాల‌ర్‌షిప్ ఎలా చెల్లిస్తారు? త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గాడిదలు

5. గాడిదలు మానవ చరిత్రను మలుపు తిప్పాయా, ఎలా?

గాడిద అంటే బరువులు మోసుకెళ్లే జంతువుగానే తెలుసు చాలామందికి. లేదంటే ఎవరినైనా అవమానించడానికి ఈ జంతువు పేరు వాడుతుంటారు.

కానీ పారిస్‌కు 280 కిలోమీటర్ల దూరంలోని ఓ ఫ్రెంచ్ గ్రామంలో గాడిదల గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని విషయాలను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.

బోయిన్‌విల్లె గ్రామంలోని రోమన్ విల్లా స్థలంలో అనేక గాడిదలకు సంబంధించిన అవశేషాలను ఈ పురావస్తు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

అవన్నీ పరిమాణంలో చాలా పెద్ద గాడిదలు. ఇప్పుడు మనం చూస్తున్న గాడిదలు వాటితో పోల్చితే మరుగుజ్జులు.

'ఇవి భారీ పరిమాణం గల గాడిదలు' అని ఫ్రాన్స్‌లోని పర్పన్ మెడికల్ స్కూల్‌కు చెందిన 'సెంటర్ ఫర్ ఆంథ్రపోబయాలజీ అండ్ జీనోమిక్స్' డైరెక్టర్ లూడోవిక్ ఆర్లాండో చెప్పారు.

'ఆఫ్రికా గాడిదలతో జన్యుపరంగా పోలికలు కనిపిస్తున్న ఈ గాడిదలు గుర్రాల కంటే పెద్దవి' అన్నారు ఆర్లాండో.

ఈ గాడిదల అస్థిపంజరాల నుంచి సేకరించిన డీఎన్‌ఏను సీక్వెన్స్ చేసే ప్రాజెక్టుకు ఆర్లాండో నేతృత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ICYMI: This week's must-read articles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X