వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాడిద తంతే.. తిరిగి తంతామా?: మతలబేంటి? కట్జూ ఎందుకిలా అన్నారు!..

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రాళ్లదాడి నుంచి తమను రక్షించుకునేందుకు జవాన్లు ఓ రాళ్లు రువ్విన వ్యక్తిని జీపుకు ముందుభాగంలో కట్టినట్లు కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఆర్మీ జవాన్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. పనాగ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన బాలీవుడ్ సింగర్ అభిజిత్.. పనాగ్ ఓ పాక్ మద్దతుదారు అంటూ విమర్శించారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ హెచ్ఎస్ పనాగ్ కు మద్దతుగా నిలిచారు. ఎవరి మాటలు పనాగ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గాడిద మిమ్మల్ని తంతే దాన్ని తిరిగి తంతారా? అంటూ ఎద్దేవా చేశారు.

If a donkey kicks you, do you kick it back asks Markanday Katju on singer's insulting tweet to retired Army General

కాగా, కశ్మీర్ వీధుల్లో భారత జవాన్లపై వేర్పాటువాదులు రాళ్లు రువుతున్న సంగతి తెలిసిందే. దీంతో జవాన్లకు వారిని కట్టడం చేయడం కష్టంగా మారింది. జవాన్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. పోలీసులు వేర్పాటువాదులకు ఊహించని షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు లీక్ అవడంతో ఇప్పుడు వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రాళ్లదాడి నుంచి తమను రక్షించుకునేందుకు జవాన్లు ఓ రాళ్లు రువ్విన వ్యక్తిని జీపుకు ముందుభాగంలో కట్టినట్లు కనిపిస్తోంది. తద్వారా వేర్పాటువాదులు తమపై దాడి చేయరనేది జవాన్ల ప్లాన్. దీనిపై సీరియస్ అయిన రిటైర్ట్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్.. భారత ఆర్మీ చరిత్రలో ఇదో మాయని మచ్చగా నిలిచిపోతుందని విమర్శించారు. దీంతో ఆయన్ను పాక్ మద్దతుదారుడంటూ విమర్శలు మొదలైన తరుణంలో.. కట్జూ ఆయనకు అండగా నిలబడ్డారు.

English summary
Retired Lieutenant General HS Panag is now getting massive support on Twitter for saying that a civilian tied to an army jeep in Kashmir as a "human shield" against stone-pelters "will haunt the Indian Army."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X