వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందుకే చేయి కలిపా: 7భాషల్లో కేజ్రీవాల్, తెలుగులో

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కాంగ్రెసు పార్టీ మద్దతును ఎందుకు తీసుకున్నామో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) ఇంటర్నెట్లో ఏడు భాషల్లో వివరించింది. ఎఎపి మంగళవారం యూ ట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది.

కాంగ్రెసు, బిజెపిల మద్దతు తీసుకోమని, మళ్లీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించిన తాము కాంగ్రెసు పార్టీ మద్దతును ఎందుకు తీసుకున్నామో చెప్పే ప్రయత్నం చేసింది. ఈ వీడియో తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ, ఆంగ్ల భాషలలో ఉంది. రెండు రోజుల క్రితం అప్‌లోడ్ ఇది బాగా షేర్ అవుతోంది.

Arvind Kejriwal

తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అని ప్రజలను అడిగితే రెండు సమాధానాలు వచ్చాయన్నారు. ఒకటి కాంగ్రెసు, బిజెపిలకు దూరంగా ఉండమని, రెండోది ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమాధానాలు వచ్చాయన్నారు. ఇప్పటికీ తమది మైనార్టీ ప్రభుత్వమేనని, కాంగ్రెసు, బిజెపిలు ప్రతిపక్షంలోనే ఉన్నాయని చెప్పారు.

ఎఎపి ప్రభుత్వంలో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి మంత్రి పదవులు ఉండవని, ఆ పార్టీ బయటి నుండే మద్దతిస్తుందని చెప్పారు. అవినీతిపై రాజీపడమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల హామీలను అమలుపరుస్తామని చెప్పారు. రెండు వారాల్లో లోక్‌పాల్ బిల్లు ప్రవేశ పెడతామన్నారు.

<center><center><center><center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/JC3atTHOkiQ?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center></center>

English summary
After taking Congress support to form a government in Delhi based on feedback from the streets, Arvind Kejriwal's AAP has gone online to justify its decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X