భారత్-చైనా 14వ రౌండ్ సైనిక చర్చలు విఫలం; మళ్ళీ అదే ప్రతిష్టంభన!!

ఎంతో ఉత్కంఠభరితంగా అందరూ ఎదురు చూసిన చైనా భారత్ ల మధ్య జరిగిన 14వదఫా సైనిక చర్చలు కూడా విఫలం అయ్యాయి. బుధవారం జరిగిన 14వ రౌండ్ ఇండియా-చైనా సైనిక చర్చలు ఎటువంటి సానుకూల ఫలితాలను ఇవ్వలేకపోయాయి. పద్నాలుగవ కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అయితే లడఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరు దేశాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాయని సమాచారం. చర్చలను కొనసాగించడానికి తదుపరి రౌండ్ త్వరలో నిర్వహించబడుతుందని భావిస్తున్నారు.

భారత్ చైనా ల మధ్య జరిగిన 14 వ రౌండ్ సైనిక చర్చలు విఫలం

భారత్ చైనా ల మధ్య జరిగిన 14 వ రౌండ్ సైనిక చర్చలు విఫలం

ఇరు పక్షాలు ఈరోజు చర్చలపై ప్రకటనలతో ముందుకు రావాల్సి ఉండగా, కొంగ్కా లా సమీపంలోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ నుండి వైదొలగడానికి, అలాగే దౌలెట్ బేగ్ ఓల్డి సెక్టార్‌లోని డెప్సాంగ్ బల్గే మరియు చార్డింగ్ నుల్లాలో డెమ్‌చోక్ సెక్టార్‌లోని జంక్షన్ పెట్రోలింగ్ హక్కుల సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం చైనా ఆర్మీ ని ఒప్పించడంలో స్పష్టంగా విఫలమైంది. చైనా భారత్ ల మధ్య చర్చలు ఎటువంటి సానుకూల ఫలితాలు లేకుండా ముగిశాయి. దీంతో పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాలను చేరుకోవడం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి .

హాట్ స్ప్రింగ్స్ పై జరిగిన చర్చ .. భారత్ కు ఎలాంటి హామీ ఇవ్వని చైనా

హాట్ స్ప్రింగ్స్ పై జరిగిన చర్చ .. భారత్ కు ఎలాంటి హామీ ఇవ్వని చైనా

చైనా భారత్ ల మధ్య జరిగిన సైనిక చర్చలు ఫెయిల్ కావటంతో భారత సైన్యం మరియు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు ఇద్దరూ ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద ఎక్కడైతే ఉన్నారో అక్కడే యధాతధ స్థితిని కొనసాగిస్తారు. గోగ్రా-హాట్ స్ప్రింగ్స్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏప్రిల్ 2020 యథాతథ స్థితిని పునరుద్ధరిస్తుందా లేదా డెప్సాంగ్ బల్గే లేదా చార్డింగ్ నుల్లాలో డెమ్‌చోక్ సెక్టార్‌లోని జంక్షన్ సమస్యను పరిష్కరిస్తుందా అనే దానిపై ఎటువంటి హామీ లేదు.

పాంగోంగ్ త్సో వంతెన నిర్మాణంపై చైనాతో చర్చల్లో భారత్ ప్రస్తావన

పాంగోంగ్ త్సో వంతెన నిర్మాణంపై చైనాతో చర్చల్లో భారత్ ప్రస్తావన

597-కిమీ లడఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతంలో వేగవంతమైన సైనిక మోహరింపు, వేగవంతమైన సైనికీకరణ కోసం, శ్రీజాప్ కాంప్లెక్స్‌కు తూర్పున ఉన్న పాంగోంగ్ త్సోపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వంతెన నిర్మాణం సమస్యను భారత సైన్యం స్పష్టంగా లేవనెత్తింది. వాస్తవం ఏమిటంటే, కొత్త సరిహద్దు చట్టంతో మరియు వేగవంతమైన సైనిక మరియు సాంకేతిక అప్‌గ్రేడేషన్‌తో చైనా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం సాగిస్తుంది.

లద్దాక్ వద్ద ఏకపక్షంగా వాస్తవాధీన రేఖ మార్చే యత్నం చేసిన చైనా.. అప్పటి నుండి యుద్ధమేఘాలు

లద్దాక్ వద్ద ఏకపక్షంగా వాస్తవాధీన రేఖ మార్చే యత్నం చేసిన చైనా.. అప్పటి నుండి యుద్ధమేఘాలు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్ సూచనల మేరకు చైనా సైన్యం ఏకపక్షంగా వాస్తవాధీన రేఖను మార్చాలని, తిరస్కరించబడిన 1959 కార్టోగ్రాఫికల్ లైన్‌ను లడఖ్ వాస్తవాధీన రేఖపై విధించాలని నిర్ణయించినప్పటి నుండి భారత మరియు చైనా సైన్యాలు రెండూ లడఖ్ వాస్తవాధీన రేఖ పొడవునా ప్రతిష్టంభనలో ఉన్నాయి. మే 2020 నుండి రెండు వైపులా క్షిపణి, రాకెట్, ఆర్టిలరీ మరియు ట్యాంక్ రెజిమెంట్‌లతో పాటు, వైమానిక దళం సిద్ధంగా ఉండటమే కాకుండా రెండు వైపులా మూడు కంటే ఎక్కువ దళాలతో పూర్తిగా మోహరించిన పరిస్థితి ఉంది.

చైనా దురాక్రమణల నేపధ్యంలో మొదలైన వివాదం .. ఇంకా ప్రతిష్టంభనలోనే

చైనా దురాక్రమణల నేపధ్యంలో మొదలైన వివాదం .. ఇంకా ప్రతిష్టంభనలోనే


చైనా సైన్యం మే 2020లో పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దురాక్రమణలకు పాల్పడుతూ ఒప్పందాలను అతిక్రమించడం ద్వారా భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. ఆపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధినేతల స్థాయిలో సంతకం చేసిన1993 ద్వైపాక్షిక మరియు 1996 శాంతి ఒప్పందాలను ఉల్లంఘించింది. ఇక అప్పటి నుంచి మొదలైన వివాదం తాలూకు ప్రతిష్టంభన నేటికీ కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+