వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్షకు అగ్ని 5 సిద్ధం: ఉత్తర చైనాపై దాడి చేయొచ్చు

ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) అగ్ని 5 ని పరీక్షించేందుకు భారత్ సిద్ధమయింది. మరోసారి, రెండు సంవత్సరాల అనంతరం ఇప్పుడు తుది పరీక్షకు సిద్ధమవుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) అగ్ని 5 ని పరీక్షించేందుకు భారత్ సిద్ధమయింది. మరోసారి, రెండు సంవత్సరాల అనంతరం ఇప్పుడు తుది పరీక్షకు సిద్ధమవుతోంది. ఒడిశాలో ఈ ప్రయోగ పరీక్ష చేయనున్నారు.

అణు సామర్థ్యం కలిగిన అగ్ని 5 ప్రయోగానికి అంతా సిద్ధంగా ఉందని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిని డిసెంబర్ చివర్లో లేదా జనవరి ప్రారంభంలో పరీక్షించనున్నారు. 2015 జనవరిలో పరీక్షించారు. అనంతరం అగ్ని 5లో చిన్నచిన్న సాంకేతిక సమస్యలను గుర్తించి, సర్దుబాటు చేయాల్సి వచ్చిందన్నారు.

agni v

కాగా, ఈ ఖండాంతర క్షిపణి అగ్ని 5కి 5000 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ష్యం ఉంది. ఈ ఈ క్షిపణి ప్రయోగంతో చైనాలోని ఉత్తర ప్రాంతంలో కూడా దాడులు జరపవచ్చు. గతంలో అనేకసార్లు క్షిపణి ప్రయోగం చేపట్టాలనుకున్నా చివరి నిమిషంలో సాంకేతిక అంశాలతో వాయిదాపడింది.

అయితే వీటిని సరిదిద్దినట్టు రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. ఇప్పటి వరకు ఇలాంటి క్షిపణులు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ల వద్ద మాత్రమే ఉన్నాయి.

మూడు దశల్లో పని చేసే ఈ క్షిపణి ఒక టన్ను బరువున్న అణు వార్‌హెడ్‌ను తీసుకెళ్లగలదు. భారత్‌ వద్ద ఉన్న అన్ని క్షిపణుల్లో ఇవి సుదూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. ఒడిశాలోను వీలర్ ఐల్యాండ్ నుంచి ప్రయోగించనున్న ఈ క్షిపణి బరువు 50 టన్నులు.

క్షిపణి లక్ష్య సామర్థ్యం ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు. ఎత్తు 17.5 సెంటీమీటర్లు. వ్యాసం 2 మీటర్లు. గత పదిహేడేళ్లలో దేశంలో అభివృద్ధి చేసిన మీడియా, లాంగ్ రేంజ్ క్షిపణుల్లో ఇది ఐదవది.

English summary
India is getting ready to test its Agni-V intercontinental ballistic missile (ICBM) in its final operational configuration from Wheeler Island off Odisha after two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X