వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కాలంలో టీబీ విజృంభణ.. పోషకాహార లోపంతో బరువు తగ్గుదల, మరణాలు..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో జనాభా, వైశాల్యపరంగా భారతదేశం పెద్దది. కరోనా వైరస్ వల్ల గతేడాది మార్చి నెలలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ సోకుతుందని అత్యవసర సేవలు తప్ప.. ఇతరులు బయటకు వెళ్లడం లేదు. దీంతో రోజువారీ కూలీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనికి తోడు పేదరికం ప్రధాన సమస్యగా మారింది. నిరుపేదలు తినడానికే ఇబ్బంది ఏర్పడింది. ఆహార కొరత, పౌష్టికాహారం లోపం వల్ల టీబీ వ్యాధి విస్తరించింది.

పేదరికం, పోషకాహార లోపం వల్ల టీబీ వ్యాధి విజృంభించింది. వ్యాధి సోకిన వారి రికవరీపై కూడా ప్రభావం చూపించింది. టీబీ వ్యాధి నివారణ ఆశించిన స్థాయిలో లేదు. వాస్తవానికి టీబీ సోకితే సదరు రోగి బరువు క్రమంగా తగ్గుతారు. వ్యాధి సోకితే ఆకలిని తగ్గిస్తోంది. దీంతో పోషకాహారం తీసుకోకపోవడం వల్ల బరువును ఆటోమెటిక్‌గా తగ్గుతారు. సదరు రోగికి విపరీతమైన జ్వరం వస్తోంది. అలా కాలరీలు ఖర్చయి కండరాల విచ్చిన్నానికి దోహదం చేస్తోంది.

India has a large underweight population with TB

రోగి యొక్క కఫం ప్రతికూలతను పరీక్షించడానికి తీసుకునే సమయం బట్టి రికవరీ ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం ఉన్న రోగులు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చనిపోయే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. కరోనా కాలంలో సరయిన ఆహారం లభించడమే గగనం. అలాంటిది పోసహాకారం తీసుకోవడం కష్టమయ్యింది. దీంతో టీబీ సోకిన వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.. అందుకు అయ్యే వ్యయం ప్రశ్న ఉత్పన్నమయ్యింది.

నిక్షయ్ పోషన్ యోజన కింద టీబీ వచ్చిన వారికి నెలకు రూ.500 ఇచ్చేవారు. కానీ కరోనా సమయంలో ఆ నగదు రాలేదని చాలా మంది ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో చాలా మంది మరణం అంచుల వరకు వెళ్లిన వారు ఉన్నారనే కఠోర నిజాలు తెలుస్తున్నాయి.

English summary
Developing TB also compounds undernutrition and weight loss. First, the disease reduces appetite and hence dietary intake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X