వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డుల్లో నిలిచిన కాలేజీ ప్రిన్సిపాల్ , సహోద్యోగుల సహకారం లేకపోవడంతో రాజీనామా

తొలి హిజ్రా కాలేజీ ప్రిన్సిఫాల్ గా రికార్డుల్లో నిలిచిన మనాలీ బందోపాద్యాయ రాజీనామా చేశారు. సహోద్యోగులు సహకారం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా :కాలేజీ సిబ్బంది సహకారంలేకపోవడం, విధ్యార్థులు కూడ తనకు వ్యతిరేకంగా నడుచుకోవడంతో కోల్ కతాలోని ఓ కాలేజీ ప్రిన్సిఫాల్ తన భాద్యతల నుండి తప్పుకొన్నారు. తొలి హిజ్రా ప్రిన్సిఫాల్ గా భాద్యతలు స్వీకరించిన ఘనతను మనాలీ బందోపాద్యాయ దక్కించుకొన్నారు. ఆమె కోల్ కతాలోని కృష్ణ నగర్ వుమెన్స్ డిగ్రీ కాలేజీకి ఆమె ప్రిన్సిపాల్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఏడాదిన్నర క్రితం ఆమె క్రిష్ణానగర్ వుమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిఫాల్ గా బాద్యతలు చేపట్టారు. ఆనాటి నుండి విధ్యార్థులతో పాటు కాలేజీ సిబ్బంది , సహచరులు సక్రమంగా సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలే కాలేజీని ఉన్నత డైరెక్టర్ ఆర్ పి భట్టాచార్య నేతృత్వంలోని బృందం కాలేజీని పరిశీలించింది. కాలేజీ నడుస్తున్న తీరును ఆ బృందం పరిశీలించింది.ఈ బృందం పరిశీలించిన తర్వాత ఆమె తాను రాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు.

india's first transgender college principal resigns

ఈ మేరకు ఆమె మూడు రోజులక్రితం నదియా జిల్లా కలెక్టర్ రాజీనామా చేస్తున్నట్టుగా లేఖను పంపారు. ఈ విషయాన్ని నదియా జిల్లా కలెక్టర్ ధృవీకరించారు.ఈ లేఖను ఉన్నత విద్యాశాఖకు పంపానని చెప్పారు.

కాలేజీ విద్యార్థులతో పాటు సహోద్యోగులు కూడ తనకు వ్యతిరేకంగా నడుస్తున్నారని ఆమె ఆరోపించారు. కాలేజీ సిబ్బంది కూడ తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ వేధింపులను భరించలేకపోతున్నట్టు ఆమె చెప్పారు. కాలేజీలో ప్రశాంత వాతావరణాన్ని కోరుకొంటున్నానని , ఆ పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు.

స్థానిక సంస్థలు ,ఉన్నత విధ్యాశాఖ నుండి తనకు మంచి సహయం వస్తోన్నా కాలేజీ సిబ్బందితో సహ అధ్యాపకులు, విధ్యార్థుల నుండి సహకారం లభించడం లేదని ఆమె ఆరోపించారు. దీంతో మానసిక ఒత్తిడికి గురై రాజీనామా చేస్తున్నట్టు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో తాను కాలేజీలో అడుగుపెట్టానని ఎవరూ సహకరించకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ఆమె చెప్పారు.

English summary
india's first transgender college principal manali bandopadhyal has submitted her resignation . fustration at non cooperation of a section of teachers and student of her institution
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X