వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడోసారి: అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం(ఫొటో)

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గల వీలర్ ఐల్యాండ్ నుంచి శనివారం ఉదయం శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. అగ్ని-5 క్షిపణి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి వెయ్యి కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.

శనివారం ఉదయం అగ్ని-5 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఐటిఆర్ డైరెక్టర్ ఎంవికెవి ప్రసాద్ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజిలోని లాంచ్ కాంప్లెక్స్-4 నుంచి దీని ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు ఈ క్షిపణిని మూడు సార్లు ప్రయోగించగా.. ప్రతీసారి విజయవంతమైంది. వివిధ ప్రాంతాల్లోని రాడార్లలో నమోదైన డేటాను సమీక్షించిన తర్వాత ప్రయోగ ఫలితంపై పూర్తి అంచనాకు వస్తారు.

భువనేశ్వర్

త్రీ స్టేజ్ మిస్సైల్ అయిన అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం.

మరికొన్ని ప్రయోగాల అనంతరం అగ్ని-5ని భద్రతా దళాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని-1(700 కిలోమీటర్లు), అగ్ని-2(2వేల కిలోమీటర్లు), అగ్ని-3(2500 కిలోమీటర్లు), అగ్ని-4(3500 కిలోమీటర్ల లక్ష్య ఛేదన) క్షిపణులు ఉన్నాయి.

English summary
India on Saturday successfully test-fired its indigenously developed, intercontinental surface-to-surface nuclear capable ballistic missile Agni-5, which has a strike range of over 5000 kms and can carry a nuclear warhead of over one tonne, from Wheeler's Island off Odisha coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X