Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలాండ్‌కు పాకిన విద్వేషం: భారత విద్యార్థిపై దాడి, ఆస్పత్రిలో చేరిక

ప్రపంచ వ్యాప్తంగా జాతి విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకే పరిమితమైన ఈ దాడులు ఇతర దేశాలకు పాకుతున్నాయి.

న్యూఢిల్లీ/వర్సా: ప్రపంచ వ్యాప్తంగా జాతి విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకే పరిమితమైన ఈ దాడులు ఇతర దేశాలకు పాకుతున్నాయి. తాజాగా, పోలాండ్‌లో ఓ భారత విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాంజన్‌ ప్రాంతంలోని ఓ ట్రామ్‌లో గత బుధవారం ఓ భారత విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఆ విద్యార్థి తన స్నేహితుడికి ఫోన్‌ చేయడంతో అతడు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

Indian student beaten up in Poland

అయితే మళ్లీ తనపై దాడి జరుగుతుందన్న భయంతో బాధితుడు తన పేరును వెల్లడించేందుకు నిరాకరించాడు. పోలాండ్‌ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అక్కడ భారత రాయబారి అజయ్‌ బిసారియాను ఆదేశించారు.

'పొలాండ్‌లో విద్యార్థిపై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం' అని సుష్మాస్వరాజ్‌ తన ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+