Fastest Metro Rail: 120 కి.మీ వేగంతో మెట్రోరైలు పరుగు-దేశంలో తొలిసారి..!
మన దేశంలో సాధారణ ట్రాక్ లపై పరుగులు తీసే రైళ్లతో పోలిస్తే ఎలివేటెడ్ ట్రాక్ లపై నడుపుతున్న మెట్రో రైళ్ల (metro rail)వేగం చాలా తక్కువ. దీంతో మెట్రో ప్రయాణాలు సైతం జనాన్ని విసుగెత్తిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలోనే తొలిసారి అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో రైలును కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ప్రధాని మోడీ ఈ స్పీడ్ మెట్రో రైలును ప్రారంభిస్తున్నారు. దీని వేగం, ఇతర ఫీచర్లు ఇప్పుడు చూద్దాం..
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ సౌత్ -మోడీపురం మధ్య మీరట్ మెట్రో సేవలు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థ. ఇందులో మెట్రో రైళ్లు గరిష్టంగా గంటకు 120 కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి. ప్రతీ మెట్రో రైలుకు సాధారణ మెట్రో రైళ్ల తరహాలోనే మూడు బోగీలు మాత్రమే ఉంటాయి. మార్గం మధ్యలో స్టాపులు యథావిధిగానే ఉంటాయి. అయితే రైలు వేగం ఒక్కటే మారుతుంది.

ప్రస్తుతం భారత్ లో మెట్రో రైళ్ల సగటుు వేగం గంటకు 30-40 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇక్కడ ఏకంగా గంటకు 120 కిలోమీటర్ల వేగం వెళ్లేలా ఈ మార్గాన్ని డిజైన్ చేశారు. అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుపుతున్న మెట్రో రైళ్లతో పోలిస్తే ఏకంగా మూడు రెట్ల వేగం అన్నమాట. ఇందుకు తగ్గట్టుగానే ఛార్జీలు కూడా వసూలు చేయబోతున్నారు. అలాగే భద్రతా ప్రమాణాలు కూడా పాటిస్తున్నారు. ఢిల్లీ-మీరట్ నమో కారిడార్ లో ఈ మెట్రో రైలును పరుగులు తీయించబోతున్నారు. దీంతో సాధారణ రైళ్ల తరహాలోనే ఈ మీరట్ మెట్రో రైలు కూడా పరుగులు తీయబోతోంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications