31 శాటిలైట్లతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 40

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-40 నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ-40 ద్వారా 31 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్దింది.2018లో ఇదే మొదటి ప్రయోగం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకే సారి అంతరిక్షంలోకి తరలించి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది.

ఇస్రో మరో భారీ ప్రయోగం: 12న నింగిలోకి 31ఉపగ్రహాలు

 ISRO To Launch 100th Satellite Today

2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది.

ఈసారి మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగిస్తుండగా, వాటిలో 28 విదేశాలకు చెందినవి. ప్రధానంగా 'కార్టోశాట్‌-2' సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం భారత్‌కు చెందినది. దీనితో పాటు మైక్రో, నానో (ఐఎన్‌ఎస్‌)లు మనదేశానివి. ఈ ప్రయోగంలో దేశీయ 100వ ఉపగ్రహం ఉండటం విశేషం.

కౌంట్ డౌన్ మొదలు

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ40 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈమేరకు 28 గంటల కౌంట్‌డౌన్ గురువారం ఉదయం 5:29 గంటలకు ప్రారంభమైంది. గత ఏడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ-సీ39 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో అన్ని చర్యలూ తీసుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four months after an unsuccessful satellite launch, Indian space agency ISRO is ready to send up another rocket. The Polar Satellite Launch Vehicle or PSLV will lift off today at 9.29 am from Sriharikota in Andhra Pradesh, carrying India's 100th satellite along with 30 others.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X