రజనీకాంత్ vsబీజేపీ: నువ్వు కన్నడిగ, తమిళ సూపర్ స్టార్ ఎలా అయ్యావు, కావేరీ, టాలెంట్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ మీద బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ మండిపడ్డారు. కన్నడిగ అయిన రజనీకాంత్ ను తమిళ సినీ పరిశ్రమ సూపర్ స్టార్ ను చేసిందని, ట్యాలెంట్ ఉన్న వారు ఎక్కడైనా పైకి వస్తారనే విషయం ఆయకు తెలీదా అని తమిళసై సౌందరాజన్ ప్రశ్నించారు. నోటికి ఎదివస్తే అది మాట్లాడటం మంచిదికాదని తమిళసై సౌందరాజన్ రజనీకాంత్ కు సూచించారు.

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు చెన్నైలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితర ప్రముఖులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

రజనీకి సూటి ప్రశ్న !

రజనీకి సూటి ప్రశ్న !

అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ గా కర్ణాటకకు చెందిన ఎంకే. సూరప్పను నియమించడంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా రజనీకాంత్ ను సూటిగా ప్రశ్నించింది. అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ గా ఎంకే. సూరప్పను నియమించడంపై రజనీకాంత్ తనదైన శైలిలో స్పంధించారు.

కావేరీ సమస్య !

కావేరీ సమస్య !

కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటక మీద తమిళనాడు పోరాటం చేస్తున్న సమయంలో అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ గా ఎంకే. సూరప్పను నియమించడం సరైన నిర్ణయం కాదని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎవరైనా భారతదేశంలో ఎక్కడైన పని చెయ్యడానికి అవకాశం ఉందని రజనీకాంత్ మీడియాకు చెప్పారు.

నిన్ను ఎవరు సూపర్ స్టార్ చేశారు

నిన్ను ఎవరు సూపర్ స్టార్ చేశారు

కన్నడిగ అయిన రజనీకాంత్ ను తమిళ సినీపరిశ్రమ సూపర్ స్టార్ ను చేసిన విషయం ఆయన మరిచిపోయినట్లు ఉన్నారని బీజేపీ తమిళనాడు శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ సోమవారం వ్యంగంగా అన్నారు. మీరు కన్నడిగ అని తమిళ ప్రజలు దూరం పెట్టారా అని తమిళసై సౌందరాజన్ రజనీకాంత్ ను ప్రశ్నించారు.

సమర్థుడు

సమర్థుడు

ఎంకే. సూరప్ప సమర్థుడు కావడం వలనే అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ గా ప్రభుత్వం నియమించిందని తమిళసై సౌందరాజన్ అన్నారు. అయితే సూరప్పను నియమించడం సరైన పద్దతికాదని రజనీకాంత్ ఎలా ప్రశ్నిస్తారు అని తమిళసై సౌందరరాజన్ సూపర్ స్టార్ ను నిలదీశారు. ఎవరైనా సరే తమిళనాడు ప్రజలు ఆదరిస్తారనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని తమిళసై సౌందరరాజన్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bharatiya Janata Party has taken exception to the remarks made by superstar Rajinikanth against the appointment of Karnataka-based M K Surappa as the vice-chancellor of Anna University in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి