వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్: ఎలక్ట్రానిక్, గృహోపకరణాలపై బంపర్ ఆఫర్లు

జిఎస్టీ ఎఫెక్ట్ తో వినియోగదారులకు ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. జీఎస్టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకొనేందుకు రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జిఎస్టీ ఎఫెక్ట్ తో వినియోగదారులకు ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. జీఎస్టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకొనేందుకు రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశాయి.గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులో వస్తున్నాయి. దాదాపు 20 నుండి 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ఏడాది జూలై 1వ, తేది నుండి జీఎస్టీ అమల్లోకి రానుంది. జిఎస్టీ అమల్లోకి వచ్చేనాటికే గృహోపకరణాలను, టివిలను డిస్కౌంట్లపై విక్రయించేందుకుగాను ఈ కామర్స్ సంస్థలు రంగం సిద్దం చేశాయి.

దాదాపుగా 20 నుండి 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకులను జూలై 1వ, తేది నాటికి విక్రయించుకొనేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నారు.

జీఎస్టీ అమలు కారణంగా ఈ రిటైలర్లకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ నష్టాలను తగ్గించుకొనేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు.

టివిలు, ప్రిజ్ లపై ఆఫర్లు

టివిలు, ప్రిజ్ లపై ఆఫర్లు

టెలివిజన్ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్లు, వాషింగ్ మెషీన్లపై బారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు బాగా తగ్గాయి. డిస్కౌంట్ అనేది సరుకు విక్రయించే రిటైలర్ పై ఆధారపడి ఉంటుంది. రిటైలర్లు ఒక వస్తువు రిటైల్ ధర సాధారణంగా 10 నుండి 15 శాం ఇస్తారు. కానీ, జీఎస్టీ పుణ్యాన ఈ డిస్కౌంట్ సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్ కు మూడు రెట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ముంబైకి చెందిన ఓ ఎలక్ట్రానిక్ రిటైల్ కంపెనీ తన ప్రొడక్టులపై 40 శాతం డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

డిస్కౌంట్లతో నష్టాలు

డిస్కౌంట్లతో నష్టాలు

డిస్కౌంట్లతో 6 నుండి 14 శాతం నష్టాలు రావొచ్చని రిటైలర్లు అభిప్రాయపడుతున్నారు. మే నెలకు ముందు కొనుగోలు చేసి ఇంకా విక్రయించని వస్తువులపై 6 శాతం నష్టాలు రావొచ్చని అంచనా.ఇక ఏడాది పాత సరుకుపై 14 శాతం వరకు నష్టాలు తప్పవని తెలిపారు. రిటైలర్లు తమ స్టాక్ మొత్తాన్ని నగదులోకి మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోట్లాది రూపాయాల పాత సరుకు

కోట్లాది రూపాయాల పాత సరుకు

పలు లూర్జ్ కన్సూమర్ ఎలక్ట్రానిక్ రిటైలర్ చైన్స్ రూ. 100 కోట్లకు పైగా పాత సరుకును కలిగి ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనావేస్తున్నాయి. దీంతో ఆయా రిటైలర్ల మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. రిటైలర్లు జూలై 1వ, తేదినాటికి సాధ్యమైనంత తక్కువ సరుకు ఉండేలా చూసుకొంటున్నారు. లేకపోతే వారంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

దిగ్గజ కంపెనీల ఆఫర్లు

దిగ్గజ కంపెనీల ఆఫర్లు

శాంసంగ్ , పానాసోనిక్, హిటాచీ , వీడియోకాన్ లాంటి సంస్థలు కూడ వినియోగదారుల ప్రమోషనల్ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. గిఫ్ట్స్ వారంటీ పొడిడింపును అందిస్తున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త సరుకును తీసుకెళ్ళడం నిలిపివేసిన దగ్గరి నుండి కంపెనీలు ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టాయి.పాత సరుకు విక్రయించుకొనేందుకు రిటైలర్లు కేంద్రీకరించారు.

ఇన్ పుట్ క్రెడిట్ 60 శాతానికి పెంపు

ఇన్ పుట్ క్రెడిట్ 60 శాతానికి పెంపు

జీఎస్టీ కౌన్సిల్ జూన్ 3 నాటి సమావేశంలో 18 లేదా అంతకన్నా ఎక్కువ జీఎస్టీ పన్ను స్లాబ్ లోని ప్రొడక్టులపై ఇన్ పుట్ క్రెడిట్ ను 40 నుండి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఎలక్ట్రికల్ వస్తువుల విషయంలో ట్రాకింగ్ ఆధారంగా వంద శాతం క్రెడిట్ ను కూడ కౌన్సిల్ ప్రతిపాదించింది. అయితే ఇక్కడ ట్రాకింగ్ అంశంపై స్పష్టత రావాలి. పరిశ్రమకు వంద శాతం క్రెడిట్ బెనిఫిట్ అందితే 25 శాతం స్టాక్ కవర్ అయిపోతోంది.

English summary
Online shoppers have a special reason to rejoice, thanks to the Goods and Services Tax (GST) to be implemented on July 1. To ensure that their stock is cleared before the new tax regime comes into action, top players like Flipkart, Amazon and ShopClues are going all out on discounts – up to 80 percent – for the longest duration ever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X