వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూఢచర్యానికి చెక్: 153 పావురాల పట్టివేత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గూఢచర్యం కోసం అక్రమంగా తరలిస్తున్న 150కిపైగా పావురాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. అరటి పండ్ల బాక్సుల్లో వీటిని ఉంచి తరలిస్తుండగా విక్రమ్ చౌక్ వద్ద అక్టోబర్ 5న సీజ్ చేశారు. వీటిని గూఢచర్యం కోసమే అక్రమంగా రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు.

153 పావురాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ పావురాలను ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు.

J&K: 150 pigeons being used for espionage, probe ordered

పావురాలకు గూఢచర్య కోసం ఉపయోగించే అయస్కాంత రింగులు కాలుకు కట్టి ఉన్నాయని ఎన్జీవో నిర్వహకులు తెలిపారు. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పావురాలను ఇలా గూఢచర్యం కోసం ఉపయోగించడం ఇది కొత్తకాదు. గతంలో కూడా పాక్ పావురాలను గూఢచర్యం కోసం వాడుకుంది.

ఇటీవల రెక్కలపై ఉర్దూ అక్షరాలతో భారత ప్రధాని నరేంద్ర మోడీకి సందేశాన్ని ఇస్తూ సరిహద్దు సమీపంలోని బామియల్‌ ప్రాంతంలో సింబల్‌పోస్ట్‌ దగ్గర ఓ పావురం బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి చిక్కింది. మరో వైపు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ జిల్లాలో గత సెప్టెంబర్‌ 23న రెక్కలపై ఉర్దూ అక్షరాలు రాసి ఉన్న ఓ తెల్లపావురం సరిహద్దును దాటి వచ్చిన విషయం తెలిసిందే.

English summary
The Jammu & Kashmir Police has seized more than 150 pigeons allegedly being smuggled for the purpose of espionage and a probe has been ordered into the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X