జయలలిత మేనకోడలు దీపా పార్టీ మారింది: రెండాకుల చిహ్నం కోసం బిగ్ ఫైట్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గత ఏడాది కన్ను మాసిన తరువాత కొద్ది నెలలకే అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. రెండు వర్గాల నాయకులు రెండాకుల చిహ్నం కోసం పోటీ పడుతున్నారు.

అయితే ఎన్నికల కమిషన్ ముందు రెండాకుల చిహ్నం మాకుకావాలంటే లేదు మాకే కావాలని మనవి చేశారు. ఈ వ్యవహారం ఇప్పటితో తేలికాదని గుర్తించిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఎవ్వరికీ కేటాంచకుండా రెండు వర్గాలను దూరం పెట్టింది. ఇప్పుడు రెండాకుల చిహ్నం కోసం మరో వర్గం పోటీ పడుతోంది.

రెండు పార్టీలతో వెళ్లారు

రెండు పార్టీలతో వెళ్లారు

పన్నీర్ సెల్వం వర్గం అన్నాడీఎంకే పురట్చితలైవీ అమ్మ పేరుతో ఓ పార్టీని పెట్టుకుని రెండు దీపాల విద్యుత్ స్తంభం గుర్తు తెచ్చున్నారు. శశికళ వర్గం అన్నాడీఎంకే అమ్మ పార్టీ అంటూ టోపీ గుర్తు తెచ్చుకున్నారు. రెండు వర్గాలు ఆర్ కే నగర ఉప ఎన్నికల్లో పోటీకి దిగారు.

నేనేం తక్కువ తిన్నాను

నేనేం తక్కువ తిన్నాను

అదే సమయంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో పార్టీ స్థాపించి పడవ గుర్తు తెచ్చుకుని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఓటర్లకు రూ. 89 కోట్ల బట్వాడా చేశారని గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు చేశారు.

రాజకీయం తెలుసుకున్న దీపా

రాజకీయం తెలుసుకున్న దీపా

జయలలిత మేనకోడలు దీపా ఇప్పుడు తన ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ పేరును మార్చేశారు. చెన్నైలోని టీ నగర్ లోని తన ఇంటిలో తన వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ మాజీ మంత్రి రూమాన పాండియన్ అధ్యక్షతన జరిగిన సీనియర్ నాయకుల సమావేశంలో చర్చించి పార్టీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే దీపా పేరు

అన్నాడీఎంకే దీపా పేరు

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరును అన్నాడీఎంకే దీపా పార్టీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు తమ పార్టీ పేరు అన్నాడీఎంకే దీపా అంటు నాయకులు మీడియాకు చెప్పారు. జయలలిత రాజకీయ వారుసురాలు తానే అంటూ రెండాకుల చిహ్నం కోసం దీపా ఎన్నికల కమిషన్ ఆశ్రయించడానికి సిద్దం అయ్యారు.

 రెండాకుల చిహ్నం కోసం బిగ్ ఫైట్

రెండాకుల చిహ్నం కోసం బిగ్ ఫైట్

రెండాకు చిహ్నం కోసం ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గంతో పాటు దీపా వర్గం కూడా ఎన్నికల కమిషన్ ముందు వారి వాదనలు వినిపించడానికి సిద్దం అయ్యారు. రెండాకుల గుర్తు లేనిదే తాము ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోలేమని మూడు వర్గాలు పసిగట్టాయి. ఇప్పుడు రెండాకుల చిహ్నం కోసం మూడు వర్గాలు పోటీ పడుతున్నాయి.

ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి

ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి

ఇదే సమయంలో దీపా జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో శాంతిభద్రల సమస్యతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa Jayakumar said, Tamil Nadu was once a haven of peace. However now, the entire administration has collapsed and the government lies in coma. Law and order has become a big question mark.
Please Wait while comments are loading...