వైరల్ వీడియో: అసెంబ్లీలో అవేం పనులు మినిస్టర్ గారు..!
చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి గలీజు పనులు. ఇదేంటి ఈ సామెత ఇప్పుడెందుకు అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, శుభ్రత పరిశుభ్రతపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే.. అదే ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం వాటిని పక్కనపెడుతున్నట్లు కనిపిస్తోంది. సరే... సాధారణ మనుషులు పాటించడం లేదంటే ఏదో అనుకోవచ్చు.. సాక్ష్యాత్తు మంత్రులే పరిశుభ్రతను మరిచి గలీజు పనులు చేస్తుంటే సామాన్యులు షాక్ అయ్యే పరిస్థితి వస్తోంది. ఇదే సీన్ రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ పరిసరాల్లో జరిగింది. ఇంతకీ ఏం జరిగింది.. ఏమా కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రాజస్థాన్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఝబర్ సింగ్ ఖర్రా వివాదంలో చిక్కుకున్నారు. శాసనసభ జరుగుతున్న వేళ హౌజ్లో ఆయన ఉమ్మివేయడం కెమెరా కంటికి చిక్కింది.ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా జరిగిన ఈ ఘటన, సభలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన, నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది.మంత్రి మాట్లాడుతుండగా ఆయన నోట్లోకి ఏదో ప్రవేశించినట్లు వీడియోలో కనిపించింది.దీంతో ప్రసంగం మధ్యలో ఆపి అక్కడే ఉమ్మివేశారు.ఆయన ఉమ్మి వేసే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.ఈ సంఘటన పెద్ద రాజకీయ దుమారాన్ని రేపగా, ప్రతిపక్ష సభ్యులు దీనిని అసెంబ్లీ గౌరవానికి భంగమని అభివర్ణించారు.మంత్రిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సభ నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై చట్టసభ ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించి,తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సభ గౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా తగిన చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నాయి.
BJP Minister Jhabar Singh Spits Inside Rajasthan Assembly
— India Brains (@indiabrains) February 27, 2026
A controversy erupted after BJP minister Jhabar Singh was seen spitting in the Assembly before speaking during the Rajasthan Budget session.
The incident has drawn criticism from the public, with many saying that instead… pic.twitter.com/LwV9Ue5p1i
అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు హరలాల్ సింగ్ ఖర్రా కుమారుడైన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ఝబర్ సింగ్ ఖర్రా, రాజస్థాన్లోని శ్రీమాధోపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2013-2018 మధ్య ఎమ్మెల్యేగా, తిరిగి 2023లో అదే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications