బీజేపీకి భారీ దెబ్బ, కాంగ్రెస్ లో మళ్లీ చేరుతున్న మాజీ సీఎం ? ఎంత నిర్లక్షం, ఎలక్ట్రానిక్ సిటీ!

Posted By:
Subscribe to Oneindia Telugu
  బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఎస్ఎం. కృష్ణ

  బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్బంగా బీజేపీకి భారీ ఎదురుదెబ్బపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, ఒక్కలిగులలో ఎంతో ప్రభావం ఉన్న నాయకుడు ఎస్ఎం. కృష్ణ బీజేపీకి రాంరాం చెప్పి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్దం అవుతున్నారని వెలుగు చూసింది.

  ఎలక్ట్రానిక్ సిటీ

  ఎలక్ట్రానిక్ సిటీ

  ఎస్ఎం. కృష్ణ దాదాపు ఐదు సంవత్సరాల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎస్ఎం. కృష్ణ సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఎంతో అభివృద్ది చెంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేసిన అనుభవం ఎస్ఎం. కృష్ణకు ఉంది.

  నిర్లక్షం చేసిన కాంగ్రెస్

  నిర్లక్షం చేసిన కాంగ్రెస్

  కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఎస్ఎం. కృష్ణకు పలుకుబడి తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందిన ఎస్ఎం. కృష్ణ ఆ పార్టీ నుంచి బయకు వచ్చేశారు.

   ఏడాది క్రితం

  ఏడాది క్రితం


  కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎస్ఎం. కృష్ణ 2017 మార్చి నెలలో బీజేపీలో చేరారు. అయితే అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా మండ్య, మైసూరు జిల్లాల్లో బీజేపీ నాయకులు ఎస్ఎం. కృష్ణ ప్రచారాన్ని తూతూమంత్రంగా ఉపయోగించుకున్నారు.

  బీజేపీలో అదే పరిస్థితి

  బీజేపీలో అదే పరిస్థితి


  మైసూరు, మండ్య, రామనగర జిల్లాల్లో ఎంతో ప్రభావం ఉన్న ఎస్ఎం. కృష్ణను బీజేపీ నిర్లక్షం చేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక్కసారి కూడా ఎస్ఎం. కృష్ణను కలవలేదు. కనీసం ఎన్నికల ప్రచారానికి ఆయన్ను ఆహ్వానించలేదు.

   కుమార్తెకు టిక్కెట్

  కుమార్తెకు టిక్కెట్

  మండ్య జిల్లాలోని మద్దూరు, లేదా బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర నియోజక వర్గం టిక్కెట్ తన కుమార్తె శాంభవికి ఇవ్వాలని ఎస్ఎం. కృష్ణ బీజేపీ నాయకులకు చెప్పారు. అయితే రాజరాజేశ్వరీనగర టిక్కెట్ ఇప్పటికే మునిరాజు అనే వ్యక్తికి కేటాయించారు. అభ్యర్థుల ఎంపిక వియంలో ఎస్ఎం. కృష్ణ అభిప్రాయాలను బీజేపీ నాయకులు సేకరించలేదు.

  ప్రియ శిష్యుడు భేటీ

  ప్రియ శిష్యుడు భేటీ

  కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, ఎస్ఎం. కృష్ణ ప్రియశిష్యుడు, విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని తెలిసింది. ఎస్ఎం. కృష్ణ అనుభవం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఉపయోగపడుతోందని ఒక అంచనాకు వచ్చారని సమాచారం. ఈ విషయం రాహుల్ గాంధీ చెవిలో వేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

  రాహుల్ గ్రీన్ సిగ్నల్ !

  రాహుల్ గ్రీన్ సిగ్నల్ !

  తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్షం చేసిన బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఎస్ఎం. కృష్ణ నిర్ణయించారని తెలిసింది. ఎంఎస్. కృష్ణను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడానికి రాహుల్ గాంధీ సైతం ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. మంచి రోజు చూసుకుని ఎస్ఎం. కృష్ణ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అదే జరిగితే బీజేపీకి శాసన సభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Karnataka assembly elections 2018: Former CM of Karnataka SM Krishna who was a Congress leader joined BJP in 2017 March, will again be joining Congress? Some sources said, Krishna is not happy by the treatment of BJP leaders and he is thinking to go back to Congress.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X