ముస్లిం విద్యార్ధిని తీవ్రవాది అన్న కర్నాటక ప్రొఫెసర్- సస్పెన్షన్, విచారణ !

కర్నాటకలో ఓ ముస్లిం విద్యార్దిని ముంబై దాడుల హంతకుడు అజ్మల్ కసబ్ తో పోల్చి తీవ్రవాదిగా పిలిచిన ఓ ప్రొఫెసర్ సస్పెండయ్యారు. రాష్ట్రంలోని మణిపాల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈ ప్రొఫెసర్ క్లాసులో ఓ ముస్లిం విద్యార్ధి పేరు పిలిచాడు. అతను పేరు చెప్పగానే.. ఓహో కసబ్ లాంటి వాడివేగా అంటూ ఎగతాళి చేశాడు. దీంతో సదరు విద్యార్ధి ప్రొఫెసర్ తో వాగ్వాదానికి దిగాడు. చివరికి ఈ వ్యవహారం తీవ్రం కావడంతో సదరు ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు.

గత శుక్రవారం సదరు ముస్లిం విద్యార్ది క్లాసుకు హాజరైన సమయంలో అటెండెన్స్ తీసుకుంటూ విద్యార్ధి పేరు పిలిచిన ప్రొఫెసర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దీంతో సదరు విద్యార్ధితో పాటు తోటి విద్యార్దులు కూడా వాగ్వాదానికి దిగడంతో పాటు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ విచారణ జరిపి సదరు ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. విషయం తెలిసిన ప్రొఫెసర్ క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతనిపై వేటు వేయడంతో పాటు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు మణిపాల్ యూనివర్సిటీ ప్రకటించింది. అలాగే సదరు విద్యార్ధికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది.

 Karnataka professor suspended for calling student terrorist, probe ordered

ఇప్పటికే కర్నాటకలో హిజాబ్ వివాదం తర్వాత విద్యాసంస్ధల్లోనూ హిందూ, ముస్లింల మధ్య సున్నితమైన పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో మణిపాల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత క్లాస్ రూమ్ లో విద్యార్ధులతో జరిగిన వాగ్వాదం వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన కొందరు ముస్లిం బాలికలకే కాదు యువకులకు కూడా కర్నాటకలో చదువుకునే స్వేచ్చ లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరుకునపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+