అదేం లేదు,తెలుగులోనే జయలలిత జవాబిచ్చారు: పన్నీర్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంతో పాటు క్రీడల శాఖ మంత్రి ని కలిసి తమిళనాడులో నివసించే తెలుగు వారి సమస్యలపైఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 40 శాతం మైనార్టీ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో 2006 లో నిర్బంధ తమిళ భాష బోధన చట్టాన్ని తెచ్చి చట్టాన్ని సరిగా పాఠశాలలలో అమలు చేయడం లేదని ఆయన చెప్పారు

Kethireddy Jagadeeswar Reddy meets Panneer Selvam

మైనార్టీ భాషల ఉపాధ్యాయుల స్థానంలో తమిళ భాష ఉపాధ్యాయులను నియమించకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన అన్నారు.దానితో విద్యార్థులందరు వారు తమ తమ మాతృభాషలలో విద్యాభ్యాసం చేశారని చెప్పారు. 2006 లో చట్టం ఆ విద్యాసంవత్సరం నుండి 2016 కు వచ్చిన 10 వ తరగతి విద్యార్థులకు కచ్చితం గా తమిళంలోనే పరీక్షలు రాయాలని నిర్దేశించారని చెప్పారు.

రాజ్యాంగo మాతృభాషలలో చదువుకోనే హక్కు ప్రజలకు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు. ఈ సమస్య పై వెంటనే స్పందించాలని ఆయన కోరారు. తమ బాషతో పాటు వారి బాషను కూడా చదువుకోవడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

Kethireddy Jagadeeswar Reddy meets Panneer Selvam

తమ మాతృభాషలో తాము చదువుకొనే విధంగా నిర్బంధ తమిళం బాష బోధన చట్టాన్ని రద్దు చేయాలని, లేకపోతే మార్పులు చేయాలని ఆయన కోరారు. అలా కాని పక్షంలో సరిహద్దు జిల్లాల్లో, చెన్నైలోని కొంత భాగంలో, తిరువాళ్ళుర్, వేలూరు, కాంచీపురం, క్రిష్ణగిరి జిల్లాల్లో తెలుగు విద్యార్తులకు తమ మాతృభాషలో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించాలని కోరారు.

అన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్న వాడుక బాష తో పాటు ఎక్కువ గా ఉన్న ప్రజల బాష అభివృద్ధి కొరకు ఆ బాషల అకాడమీని ఏర్పాటు చేశారని, ఉదాహరణకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజధాని లో ఉర్దూ అకాడమీ ఉన్నదని, కానీ తమిళనాడు లో మాత్రం గత కొన్ని సంవత్సరాలు తెలుగు వారి కోర్కె అయిన తెలుగు అకాడమీని ఏర్పాటు చేయలేదని అన్నారు.

Kethireddy Jagadeeswar Reddy meets Panneer Selvam

గత అమ్మ జయలలిత ప్రభుత్వం తెలుగువారి అన్ని సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.తమ ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీ లకు అండగా ఉంటుందని, గతంలో తెలుగు శాసనసభ్యుడు అసెంబ్లీలో తెలుగులో అడిగిన ప్రశ్నకు తమ నాయకురాలు జయలలిత తెలుగులోనే సమాధానం ఇచ్చారని పన్నీరు సెల్వం చెప్పారు.

మైనార్టీల అభ్యర్ధన మేరకు జయలలిత స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శికి ఉత్తర్వులు ఇచ్చారని, అసలు మైనార్టీ భాషల్లో చదువుకోవడానికి విద్యార్థులు లేరని ,ఒక్కొక్క పాఠశాలలో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారని ఒక నివేదికను ఇచ్చారని, ఆ నివేదిక ఆధారంగా పరీక్ష విధానం చేపట్టటం జరిగిందని తెలిపిందని పన్నీర్ సెల్వం వివరించారు.

తమిళం చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనే నిర్ణయం ఏమీ లేదని ,ఇప్పుడు తాను రాబోయే అసంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి అధ్యయనం చేసి కొత్తగా నివేదికను ఇవ్వాలని పాఠశాల విద్యా కార్యదర్శిని ఆదేశిస్తామని చెప్పారు.మంత్రి బాలక్రిష్ణ రెడ్డి సైతం తెలుగు వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయి తగిన విధంగా మైనార్టీ భాషలను తమిళనాడు లో కాపాడుతమని చెప్పారని కేతిరెడ్డి చెప్పారు

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తో పాటు పి.శ్రీనివాసరెడ్డి, స్.కృష్ణయ్య. రాజశేఖర్, రవిశంకర్.జి. గుణశేఖర్ ,ఆర్.జయంత్.. తదితరులు పాల్గొన్నారుఆడ శిశువుకు జన్మనిచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu deputy CM Panneer Selvam assued that Telugu medium scholls will be restored in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి