విష్ణుప్రయాగ వద్ద విరిగిన కొండచరియలు, నిలిచిన చార్ థామ్ యాత్ర

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చార్ థామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్ లోని చార్ థామ్ లోని అంతర్భాగమైన విష్ణు ప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ కు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకపోయింది.

రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు.వందల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందుకొన్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి రహదారిని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

char dham

ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, చనిపోయారా, అనే విషయాలు తెలియాల్సి ఉంది. నాలుగేళ్ళ క్రితం చార్ థామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాది ప్రాణాలు కోల్పోయారు.

ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయని విపత్తు నిర్వహణ బృందం సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A landslide happened near Vishnuprayag on Badrinath route in Uttarakhand affecting "Chardham Yatra" in the state. Almost 15,000 tourists are stranded due to landslide.
Please Wait while comments are loading...