వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్రోగసీకి తిరస్కరణ: కొట్టి, లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

మీరట్: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో మరో దారుణం జరిగింది. న్యాయశాస్త్ర విద్యార్థినిని వేధించి, కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సర్రోగేట్ మదర్‌గా ఉండడానికి నిరాకరించడంతో దుండగులు ఆ కిరాతర చర్యకు ఒడిగట్టారు. పోలీసులు సోమవారం ఈ విషయం చెప్పారు మీరట్‌లోని జాగృతి విహార్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

22 ఏళ్ల అమ్మాయిని ఓ అతిథి గృహం యజమాని, అతని అనుచరులు లైంగిక వేధించారని, కొట్టారని, పోలీసులు చెప్పారు. తనకు ఓ బిడ్డను కనడానికి ఆమె నిరాకరించడమే తప్పయింది. ఈ కేసులో గెస్ట్ హౌస్, ఓ ప్రైవేట్ ఆస్పత్రి యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు.

Law student raped, beaten for rejecting surrogacy

నిజానికి ఈ సంఘటన ఫిబ్రవరి 3వ తేదీన చోటు చేసుకుంది. పోలీసులు సోమవారంనాడు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

తనను గెస్ట్ హౌస్ స్టాఫ్ కొట్టారని, లాగిపడేశారని బాధితురాలు మీడియాతో చెప్పింది. తనను అపహరించడానికి ప్రయత్నించారని ఆమె చెప్పింది. ఆమె పోలీసులకు ఆదివారంనాడు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రకారం - సుభాష్ భారతికి చెందిన అతిథి గృహంలో పని చేస్తూ ఉంది. మహిళ పట్ల బయటపడుతున్న ఘోరమైన అకృత్యాలు దేశవ్యాపంగా రెండు మూడు రోజుల నుంచి కలవరాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. హర్యానాలోని రోహతక్ ఘటన అత్యంత దారుణంగా ఉంది.

English summary
In yet another incident of crime against women, a law student was allegedly harassed and beaten up at Jagruti Vihar area here for refusing to be a surrogate mother, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X