సౌర శక్తితో మీ ఇల్లు జిగేల్: ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన వర్చస్సా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: క్రమంగా పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న ఇంధన వనరుల నేపథ్యంలో కాలుష్యం లేని సోలార్ పవర్‌తో మీ ఇంటిలో వెలుగులు నింపుకోండి. భారత దేశంలో ఇంటి అవసరాలకు ఉపయోగపడే ప్రముఖ సోలార్ పవర్ కంపెనీలలో వర్చస్సా ప్రముఖమైనది, మొదటిది. ప్రపంచంలోనే ఇంధన వినియోగంలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇంధన వినియోగం క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వినియోగానికి తగినట్లుగా సహజ వనరులు ఇబ్బందికరమే. దీంతో ఇంధన లోటు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ అనేది మన దేశానికి ఇంధన లోటును భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది.

వర్చస్సా వివిధ రకాల సోలార్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్‌ను అందిస్తుంది. సోలార్ ఈపీసీ సర్వీసెస్, సోలార్ రూఫ్ టాప్ సొల్యూషన్స్ అండ్ ఆపరేషన్స్‌తో పాటు సోలార్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2011లో కంపెనీ ఏర్పాటయినప్పటి నుంచి ఈ రంగంలోని ఇతర కంపెనీల్లో వర్చస్సా పేరు గడించింది.

Light up your house with Solar power

వర్చస్సా టీం ఎంతో అనుభవం కలిగినది. 100 మెగావాట్ల కంటే ఎక్కువ ఇన్‌స్టాలేషన్స్ అనుభవం కలిగి ఉంది. కేవలం ఇన్‌స్టాలేషన్స్ మాత్రమే కాదు, అవసరమైనప్పుడు పరిష్కారం కోసం అందుబాటులో ఉంటుంది.

Light up your house with Solar power

వర్చస్సా టీం అనేక సౌర ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిలో రూఫ్ టాప్, గ్రౌండ్ మౌంటెడ్ ఎస్పీవీ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఈ టీం 80కెడబ్ల్యు నుంచి 10 మెగావాట్ల వరకు విజయవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. రాజస్తాన్, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ప్రాజెక్టులు చేపట్టింది. సంబంధిత రంగాల్లో వివిధ కంపెనీలకు హాస్పిటాలిటీ, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సర్వీస్ కూడా చేసింది.

Light up your house with Solar power

వర్చస్సా ఓ వైపు సోలార్ పవర్ యూనిట్ ప్రాజెక్టులు చేపడుతూనే, మరోవైపు సోలార్ పవర్, దాని వినియోగాల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. భారత దేశంలో ఏడాదిలో ఎక్కువ కాలం, ఎక్కువ ప్రాంతాల్లో సూర్యుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ సోలార్ ఎనర్జీకి ఎంతో అనుకూలత ఉంది. సోలార్ ఎనర్జీని భద్రపరుచుకోవచ్చు. అది కర్భన పదార్తాలను వదలదు. భారత్‌లో అత్యంత ఆకర్షణీయ పునర్వినియోగ శక్తిగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Considering the increase in pollution and depletion of natural fuel sources, green and sustainable energy has become the need of the hour. Varchasva is one of the first companies in India that has popularized the use of solar energy for domestic uses. India, being the 4th largest consumer of energy in the world, sees a consistent increase in the demand for energy. It is difficult to meet the demand with natural sources, which can lead to an energy deficit. This is where solar energy can play a key role for our country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి