వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2లో ల్యాండర్‌ విక్రమ్ సాధారణంగానే పనిచేస్తోందన్న ఇస్రో

|
Google Oneindia TeluguNews

Recommended Video

    అన్ని సవాళ్లను అధిగమించిన చంద్రయాన్ 2 || One Step Away From Historic Soft-Landing On The Moon

    బెంగళూరు: జూలై 22న భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్ -2 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే కక్ష్యకు సంబంధించిన అన్ని సవాళ్లను చంద్రయాన్ -2 అధిగమించిందని ఇస్రో వెల్లడించింది. ఇక చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్దంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడినప్పటి నుంచి వాటిని దిగువ కక్ష్యకు దింపే సవాలును అధిగమించినట్లు ఇస్రో వెల్లడించింది. అనుకున్న సమయానికే ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది.

    Live updates:Chandrayaan 2 succesfully completes all orbit manoeuvres

    Newest First Oldest First
    5:43 PM, 5 Sep

    సురక్షితంగా ల్యాండ్ చేయడం అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ: ఇస్రో మాజీ ఛైర్మెన్ కిరణ్ కుమార్
    5:42 PM, 5 Sep

    చంద్రయాన్-2 మిషన్‌ను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో మానవ ప్రయత్నం చేశాం... ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం:ఇస్రో ఛైర్మెన్ శివన్
    3:06 PM, 5 Sep

    చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం వైపు పయనిస్తున్న ల్యాండర్ విక్రమ్
    1:15 PM, 5 Sep

    6 చక్రాలు కలిగిన రోవరు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది.
    12:42 PM, 5 Sep

    సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1:30 నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడిపై ల్యాండ్ కానున్న రోవర్ విక్రమ్
    10:46 AM, 5 Sep

    భారత్‌ మరో రికార్డు క్రియేట్ చేయనుంది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఇప్పటి వరకు ఏ దేశం తమ రోవర్లను పంపలేదు. తొలి దేశంగా భారత్ నిలవనుంది
    10:18 AM, 5 Sep

    అంతకుముందు చంద్రుడిపై సురక్షితమైన ల్యాండింగ్ చేసిన దేశాల్లో అమెరికా, రష్యా , చైనా దేశాలు ఉన్నాయి.
    10:17 AM, 5 Sep

    చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగం తొలిసారి చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇది విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో నాల్గవ దేశంగా నిలవనున్న భారత్
    10:17 AM, 5 Sep

    బుధవారం రోజున చంద్రుడి కక్ష్యకు సంబంధించి అన్ని సవాళ్లను అధిగమించిన చంద్రయాన్-2. బుధవారం ఉదయం 3:42 గంటలకు చివరి సవాలును అధిగమించిన చంద్రయాన్-2
    10:07 AM, 5 Sep

    చంద్రయాన్-2లో ల్యాండర్‌ విక్రమ్ సాధారణంగానే పనిచేస్తోందన్న ఇస్రో
    5:35 PM, 4 Sep

    ప్రధాని మోడీతో పాటు చంద్రయాన్ 2 సేఫ్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పలు సంస్థల నుంచి 16 మంది విద్యార్థులను ఎంపిక చేసిన ఇస్రో
    4:14 PM, 4 Sep

    ఆగష్టు 21న చంద్రుడి ఫోటోను తొలిసారిగా తీసిన చంద్రయాన్ -2
    3:21 PM, 4 Sep

    చంద్రుడికి అవతల వైపు అంటే చీకటి వైపున ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో స్టడీ చేయనున్న చంద్రయాన్ -2
    1:48 PM, 4 Sep

    ఎనిమిది పేలోడ్లను మోసుకెళ్లిన ఆర్బిటర్. బాహ్య వాతావరణంపై పరిశోధనలు, చంద్రుడిపై వాతావరణం స్టడీ చేయనున్న పేలోడ్లు.మూడు పేలోడ్లను మోసుకెళ్లిన ల్యాండర్. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయనున్న పేలోడ్లు
    1:15 PM, 4 Sep

    ల్యాండర్ విక్రమ్ సాధారణంగా పనిచేస్తోందని తెలిపిన ఇస్రో
    1:15 PM, 4 Sep

    చంద్రయాన్-2 పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తోన్న ఇస్రో.బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ నుంచి ప్రతి అంశాన్ని ట్రాక్ చేస్తున్న శాస్త్రవేత్తలు
    1:13 PM, 4 Sep

    ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన -2
    12:36 PM, 4 Sep

    చంద్రుడి పై సేఫ్ ల్యాండింగ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న చంద్రయాన్-2కు ఇక నుంచి అసలు పరీక్ష ప్రారంభం అవుతుంది: మాధవన్ నాయర్
    12:31 PM, 4 Sep

    సేఫ్ ల్యాండింగ్ అనే ప్రక్రియ ఇస్రో చరిత్రలోనే ఇది అత్యంత కఠినమైనది: ఇస్రో మాజీ ఛైర్మెన్ మాధవన్ నాయర్
    11:53 AM, 4 Sep

    సెప్టెంబర్ 7 తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య ల్యాండర్‌ విక్రమ్‌కు ఛార్జింగ్ ప్రక్రియ జరుగుతుంది
    11:51 AM, 4 Sep

    సేఫ్ ల్యాండింగ్‌కు ముందు 15 నిమిషాలు చాలా కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్. అంతకుముందు ఎప్పుడూ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేసిన అనుభవం లేదని వెల్లడించిన శివన్
    11:17 AM, 4 Sep

    సెప్టెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1:30 గంట నుంచి 2:30 గంటల మధ్య ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్
    11:16 AM, 4 Sep

    చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం వైపు పయనిస్తున్న ల్యాండర్ విక్రమ్
    11:15 AM, 4 Sep

    చిట్టచివరి కక్ష్య కుదింపు ప్రక్రియను తెల్లవారుజామున విజయవంతంగా పూర్తి చేశామని తెలిపిన ఇస్రో
    11:13 AM, 4 Sep

    కక్ష్యకు సంబంధించి అన్ని సవాళ్లను అధిగమించిన ఇస్రో

    English summary
    The Chandrayaan 2 mission has completed all its orbit manoeuvres around the Moon and is ready to land close to the lunar south pole. ISRO now aims to create history by making India the first nation to reach close to the Moon's south pole in its first attempt.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X