40 ఏళ్ల ప్రిన్సిపాల్, 21 ఏళ్ల యువకుడి సహజీవనం, ఆత్మహత్యాయత్నం, ఆమెకు 20 ఏళ్ల కుమార్తె !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: మహిళా ప్రిన్సిపాల్ తో ప్రేమలో పడిన 21 ఏళ్ల యువకుడు ఆమె దూరం అయ్యిందని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలోని జేపీ నగరలో జరిగింది. చేతికి తీవ్రగాయాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జేపీ నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 40 ఏళ్ల మహిళ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నది. 10వ తరగతి ఫెయిల్ అయిన తరుణ్ (21) అనే యువకుడు అదే స్కూల్ లో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తరుణ్ కు తల్లిదండ్రులు లేరు. తరుణ్ మహిళా ప్రిన్సిపాల్ తో సన్నిహితంగా ఉంటున్నాడు.

 ఒకే ఇంటిలో సహజీవనం

ఒకే ఇంటిలో సహజీవనం

మహిళా ప్రిన్సిపాల్, తరుణ్ ప్రేమలో పడ్డారు. స్కూల్ పూర్తి అయిన తరువాత ఇద్దరూ సినిమాలు, షికార్లకు వెళ్లడం మొదలు పెట్టారు. గత ఆరు నెలల నుంచి మహిళా ప్రిన్సిపాల్, తరుణ్ ఒకే ఇంటిలో నివాసం ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ నెల రోజుల నుంచి మహిళా ప్రిన్సిపాల్ తరుణ్ ను దూరం పెట్టింది.

 ఆత్మహత్యాయత్నం

ఆత్మహత్యాయత్నం

ఆమె దూరం అయినప్పటి నుంచి మనోవేదనకు గురైన తరుణ్ నెల రోజుల్లో రెండు సార్లు చేతులు కోసుకుని తనకు దగ్గర కావాలని మహిళా ప్రిన్సిపాల్ ను వేడుకున్నాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ప్రేమించిన ఆమె దూరం అయ్యిందని ఆవేదనతో తరుణ్ శుక్రవారం రాత్రి రెండు చేతులు కోసుకున్నాడు.

 నాకు మేడమ్ కావాలి

నాకు మేడమ్ కావాలి

తీవ్రగాయాలైన తరుణ్ ను ఆసుపత్రికి తరలించారు. తనకంటే రెండింతల వయసు ఎక్కువగా మహిళను తాను పెళ్లి చేసుకుంటానని, సమాజం ఏమనుకున్నా తాను పట్టించుకోనని, తనకు ప్రిన్సిపాల్ కానే కావాలని తరుణ్ పట్టుబడుతున్నాడు. అయితే ప్రిన్సిపల్ కు ఇప్పటికే వివాహం అయ్యింది.

 20 ఏళ్ల కూతురు, కేరళలో భర్త

20 ఏళ్ల కూతురు, కేరళలో భర్త

మహిళా ప్రిన్సిపాల్ కు 20 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రిన్సిపాల్ భర్త కేరళలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద 40 ఏళ్ల మహిళా ప్రిన్సిపాల్, 21 ఏళ్ల యువకుడి లవ్ స్టోరీ ఇప్పుడు బెంగళూరులో హాట్ టాఫిక్ అయ్యింది.

 తల పట్టుకున్న యాజమాన్యం

తల పట్టుకున్న యాజమాన్యం

మహిళా ప్రిన్సిపాల్, అదే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసిపోవడంతో ఆ విద్యా సంస్థల నిర్వహకులు తలలు పట్టుకున్నారు. విద్యా సంస్థలో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తారనే భయంతో స్కూల్ యాజమాన్యం ఆందోళన చెందుతోందని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Living Relationship Young boy attempted to suicide in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి