• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అపురూపమైన ఘట్టం: ఒకే స్టేషన్‌లో కొడుకు ఎస్పీ... తండ్రి కానిస్టేబుల్

|

తండ్రిని మించిన తనయుడివి కావాలని పెద్దలు పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ మాటల తండ్రి విన్నప్పుడు ఆనందంతో పులకించిపోతాడు. అందుకు తగ్గట్టుగానే బిడ్డను తీర్చి దిద్దుతాడు. పెద్దయ్యాక ఆ కొడుకు గొప్ప ప్రయోజకుడై నలుగురి నోళ్లలో కుమారుడి పేరు నానుతుంటే ఆ తృప్తి వర్ణించలేనిది. ఇక తండ్రి పనిచేసే డిపార్ట్‌మెంట్‌లోనే కొడుకు అధికారిగా వస్తే ఇక ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా ఓ కొడుకు కన్నతండ్రి కన్న కలలను సాకారం చేశాడు. అతనికే బాస్‌గా వచ్చాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో.

ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు

ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు జనార్దన్ సింగ్. జనార్దన్ సింగ్ తన పిల్లలను కష్టపడి చదివించాడు. తన కష్టానికి తగ్గ ఫలితాన్నే పొందాడు తండ్రి జనార్దన్ సింగ్. తన కొడుకు అనూప్ సింగ్ ఐపీఎస్ అయ్యాడు. జనార్దన్ సింగ్ పనిచేసే ఉత్తర లక్నో ప్రాంతానికే ఎస్పీగా వచ్చాడు. ఇక ఆ తండ్రికి కావాల్సిన ఆనందం ఇంతకంటే ఏముంటుంది చెప్పండి. తన కొడుకుని ఉన్నత స్థానంలో చూసేందుకు జనార్దన్ సింగ్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొడుకు చదువు కోసం అప్పులు చేశాడు. అయినప్పటికీ బెదరలేదు. ఎందుకంటే తన కొడుకుపై తనకున్న విశ్వాసమే అనూప్‌సింగ్‌ను ఉన్నత స్థానానికి చేర్చింది.

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేవారు

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేవారు

అనూప్ సింగ్‌ది కష్టపడే మనస్తత్వం అని జనార్దన్ సింగ్ చెప్పారు. విజయం సాధించాడు కదా అని గర్వపడే మనస్తత్వం అనూప్‌ది కాదని తండ్రి చెప్పాడు. తనను చదివించేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డాడని అనూప్ సింగ్ తెలిపారు. ఏ ఉద్యోగమైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా బాధ్యతలను మాత్రం సక్రమంగా నిర్వర్తించాలని ఎప్పుడూ చెబుతారని అనూప్ సింగ్ తెలిపారు. తన దినచర్య రోజు తన తండ్రి పాదాలకు నమస్కరించడంతో ప్రారంభమవుతుందని అనూప్ వెల్లడించారు. ప్రస్తుతం తండ్రీ కొడుకులు ఇద్దరు ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ముందు అనూప్ నాకు బాస్... ఆ తర్వాతే కొడుకు

ముందు అనూప్ నాకు బాస్... ఆ తర్వాతే కొడుకు

కొడుకు ఎస్పీ కావడం సంతోషంగా ఉందని చెప్పిన జనార్దన్ సింగ్...తనకు ముందుగా డ్యూటీ ముఖ్యమని ఇందులో భాగంగా తన కొడుకు అనూప్ సింగ్ తనకు బాస్ అని చెప్పాడు. ఆ తర్వాతే తనకు కొడుకు అని చెప్పిన జనార్దన్ సింగ్ ముందుగా అతనికి సెల్యూట్ చేస్తానని చెప్పాడు. తన బాస్ కింద పనిచేయడం చాలా ఆనందంగా ఉందని కానిస్టేబుల్ జనార్దన్ తెలిపాడు. ఇటువంటి భాగ్యం చాలా తక్కువ మంది తండ్రులకు దొరుకుతుందని వివరించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a moment of pride and honour for police constable Janardan Singh, his son Anoop Kumar Singh has been appointed as the Superintendent of Police (North) in Lucknow, a city where he himself is posted. He will now work under his son.Anoop has taken charge of the city where his father is posted at the Vibhuti Khand police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more