CS Karnan: హైకోర్టు మాజీ జడ్జి, సార్ కు బెయిల్ వచ్చింది, ఒక్క షరతు తప్పినా.... గోవిందా గోవిందా !
చెన్నై: న్యాయమూర్తులు (జడ్జ్ లు), మహిళలను నోటికి వచ్చినట్లు దూషించాడని, మహిళలను కించపరిచే వీడియోలు విడుదల చేశారని ఆరోపిస్తూ అరెస్టు అయిన హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి సీఎస్. కర్నన్ కు మద్రాసు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘిస్తే మళ్లీ కఠిన చర్యలు తీసుకుంటామని రిటైడ్ న్యాయమూర్తికి మద్రాసు హైకోర్టు హెచ్చరించింది. సార్ ఒక్క షరతు ఉల్లంఘించినా కష్టాలు తప్పవని న్యాయనిపుణలు అంటున్నారు.

రచ్చరచ్చ చేసిన సీఎస్ కర్నన్
న్యాయమూర్తులు, మహిళలను కించపరిచే విధంగా బహిరంగంగా మాట్లాడటమే కాకుండా వారిని కించపరుస్తూ హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి కర్నన్ మాట్లాడారని ఆరోపిస్తూ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో తాను తక్కువ కులంవాడు కావడం వలనే తన మీద కేసులు నమోదు చేశారని రిటైడ్ న్యాయమూర్తి కర్నన్ న్యాయవ్యవస్థ మీద, పోలీసు శాఖ, ప్రభుత్వాల మీద తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు.

అరెస్టు మాత్రం తప్పలేదు
కర్నన్ ను అరెస్టు చెయ్యాలని కోర్టులు ఆదేశించడంతో మాజీ న్యాయమూర్తి కర్నన్ పోలీసులకు చిక్కకుండా చాలా కాలం తప్పించుకుని తిరగడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. చివరికి పోలీసులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కర్నన్ ను అరెస్టు చేశారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కర్నన్ అనేకసార్లు కోర్టులను ఆశ్రయించారు.

మాజీ జడ్జికి షరతులతో బెయిల్
రిటైడ్ జడ్జి వేసిన బెయిల్ పిటిషన్ ను గత నెలలో మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. మళ్లీ బెయిల్ కోసం కర్నన్ హైకోర్టును ఆశ్రయించారు. రూ. 50,000 పూచీ కత్తుతో మాజీ జడ్జి కర్నన్ కు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి భారతిదాసన్ బెయిల్ మంజూరు చేశారు. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా వాళ్ల ముందు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు రిటైడ్ జడ్జికి సూచించింది.
Recommended Video

ఈసారి మాట్లాడితే అంతే గతి
న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, కోర్టు ఉద్యోగులు, లాయర్లతో పాటు న్యాయవ్యవస్థకు చెందిన సిబ్బందిపై ఎక్కడా మాట్లాడకూడదని, ఇంటర్వూలు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో వారికి విరుద్దంగా పోస్టులు పెట్టకూడదని, ఉద్దేశపూర్వకంగా ఎక్కడా మాట్లాడకూడదని, నా కులాన్ని దూషించారని విచారణ అధికారుల మీద కోపంతో మళ్లీ కేసులు పెట్టకూడదని, అలా చేస్తే బెయిల్ రద్దు చేస్తామని హద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వి. భారతిదాసన్ మాజీ జడ్డి కర్నన్ షరతులు విధించారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications