నటి లైంగిక దాడి కేసు: పాపం మలయాళం హీరో దిలీప్, నో బెయిల్, నాకు ఏపాపం తెలీదు!

Posted By:
Subscribe to Oneindia Telugu

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కు చుక్కెదురైయ్యింది. తనకు బెయిల్ ఇవ్వాలని కేరళ హైకోర్టులో పిటీషన్ వేసిన దిలీప్ కు చేదు అనుభవం ఎదురైయ్యింది.

ప్రముఖ నటి లైంగిక దాడి కేసు: కోయంబత్తూరులో విచారణ, అక్కడే వీడియో మెమొరీ కార్డు?

నటి లైంగిక దాడి కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నానని, తనకు ఏపాపం తెలీదని, కావాలనే కేసులో ఇరికించారని మలయాళం హీరో దిలీప్ కేరళ హైకోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు.

 Malayalam actor Dileep bail plea post pond to next week

శుక్రవారం దిలీప్ పిటీషన్ విచారణ చేసిన కేరళ హైకోర్టు బెయిల్ విషయంలో పోలీసులను ప్రశ్నించింది. హీరో దిలీప్ పల్సర్ సునీ, అతని స్నేహితులకు కిరాయి ఇచ్చి నటిని కిడ్నాప్ చేయించి లైంగిక దాడి చేయించారని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వరాదని కౌంటర్ దాఖలు చేశారు.

నటి లైంగిక దాడి కేసు: జైల్లో మలయాళం హీరో లగ్జరీ లైఫ్, సెల్ లో లేడంట, అధికారులతో!

ఇరు వర్గాల వాదన విన్న కేరళ హైకోర్టు పిటీషన్ విచారణ ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే మూడుసార్లు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించిన దిలీప్ మరో వారం రోజులు జైలుకే పరిమితం అయ్యాడు. ఈనెల 22వ తేదీ వరకు దిలీప్ ను జ్యుడీషియల్ రిమాండ్ లో పెట్టాలని అంగమాలి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Kerala High Court Friday postponed the hearing on the bail plea submitted by actor Dileep, who is in judicial custody for his alleged involvement in the actress abduction and assault case.
Please Wait while comments are loading...