మహిళా ఉద్యోగినికి 'బూతు' మెయిల్: అసభ్య పదజాలంతో..

Subscribe to Oneindia Telugu

ముంబై: ఓ మహిళా ఉద్యోగినికి అసభ్య పదజాలంతో బూతు సందేశం పంపించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సదరు నిందితుడు ఇన్నాళ్లు అమెరికాలోనే ఉండటంతో.. తాజాగా అతను ఇండియాకు వస్తున్న విషయం తెలసుకుని, ఎయిర్ పోర్టులోనే అతన్ని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు(30)కి గతేడాది నవంబర్ లో 52ఏళ్ల వ్యక్తి అసభ్య పదజాలంతో ఈమెయిల్ పంపించాడు. ఏవో కొన్ని కారణాలతో అతను పంపించిన ఈమెయిల్ ను చూసి సదరు ఉద్యోగిని షాక్ తిన్నది. 'ఎఫ్' అనే పదాన్ని ఉపయోగించి తనను దూషించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Man arrested for using F-word in email to woman employee

ఉద్యోగిని ఫిర్యాదుతో అమెరికాలో ఉన్న అతనికి భారత పోలీసులు సమన్లు పంపించారు. సమన్లకు నిందితుడు స్పందించకపోవడంతో.. అతను ఇండియాకు ఎప్పుడొస్తాడా? అని వేచి చూశారు. తీరా సోమవారం నాడు అతను ముంబై విమానశ్రయంలో అడుగుపెట్టడంతో లుకౌట్ నోటీసులతో కాచుకుని ఉన్న అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులు, మహిళలను అసభ్యంగా దూషించడం, పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురిచేయడం వంటి అభియోగాలను నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amboli police on Monday arrested a 52-year-old man for allegedly using the F-word in an email addressed to a woman employee last year.
Please Wait while comments are loading...