వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Harassment: మహిళతో ఇమామ్ కు ? ఫ్యామిలీకి తెలిసి మసీదు బయటే ఇద్దర్ని, ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

నోయిడా/ న్యూఢిల్లీ: మసీదు పెద్ద (ఇమామ్)కు స్థానికంగా నివాసం ఉంటున్న మహిళకు గొడవ జరిగింది. మసీదు బయట గొడవ జరిగిన తరువాత స్థానికులు కొందరు మహిళకు, మసీదు పెద్దకు నచ్చచెప్పి పంపించేశారు. మహిళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. రాత్రి గుర్తు తెలియ వ్యక్తులు మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసి బయటకు వచ్చిన ఇద్దరిని పట్టుకుని చితకబాదేశారు. తీవ్రగాయాలైన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మసీదు పెద్దతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మీద గుర్తు తెలియన వ్యక్తులు దాడి చెయ్యడం కలకలం రేపింది.

Cheating: ప్రియుడి టాలెంట్, భార్య, ఇద్దరు అమ్మాయిలు, వాడిని ఉరితీయండి, వీడియో తీసి !Cheating: ప్రియుడి టాలెంట్, భార్య, ఇద్దరు అమ్మాయిలు, వాడిని ఉరితీయండి, వీడియో తీసి !

మసీదు పెద్ద

మసీదు పెద్ద

ఉత్తరప్రదేశ్ లోని దంకూర్ ప్రాంతంలోని రామ్ పురలో ఓ మసీదు ఉంది. ఈ మసీదులో మోహమ్మద్ నాసీర్ అనే వ్యక్తి మతపెద్ద (ఇమామ్) గా పని చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ముస్లీం సోదరులు ఇదే మసీదుకు వెళ్లి ఇమామ్ నాసీర్ తో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా వైరస్ సందర్బంగా లాక్ డౌన్ విధించిన సమయంలో కూడా మసీదులో కొందరు ప్రార్థనలు చెయ్యడానికి వెలుతున్నారు.

మహిళతో ఇమామ్ గొడవ

మహిళతో ఇమామ్ గొడవ

శనివారం మసీదు పెద్ద నాసీర్ కు, స్థానికంగా నివాసం ఉంటున్న మహిళకు వాగ్వివాదం జరిగింది. మాటామాటా పెరగడంతో గొడవ పెద్దది అయ్యింది. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్లు మసీదు పెద్ద నాసీర్ కు, గొడవపడిన మహిళకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇంటికి వెళ్లిన మహిళ తనతో మసీదు పెద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, నాతో గొడవ పెట్టుకున్నాడని చెప్పిందని సమాచారం.

మసీదు ఇమామ్ మీద దాడి

మసీదు ఇమామ్ మీద దాడి

తన మీద మహిళ వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పిందని తెలుసుకున్న మసీదు పెద్ద నాసీర్ భయపడ్డాడు. రాత్రి మసీదులో ప్రార్థనలు చేసిన నాసీర్ మహమ్మద్, ఫథా మోహమ్మద్ బయటకు వచ్చారు. మసీదు నంచి బయటకు వస్తున్న సమయంలోనే గుర్తు తెలియన వ్యక్తులు ఇద్దరినీ పట్టుకుని చితకబాదేశారు.

మహిళను వేధించాడని దాడి

మహిళను వేధించాడని దాడి

తీవ్రగాయాలైన నాసీర్ మోహమ్మద్, ఫతా మోహమ్మద్ ను ఆసుపత్రికి తరలించారు. నాసీర్ తలకు గాయాలైనాయని, ఫతాకు శరీరం మీద గాయాలైనాయని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి అరవింద్ పాథక్ మీడియాకు చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ఇమామ్ నాసీర్ స్థానికంగా నివాసం ఉంటున్న మహిళను వేధించాడని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని, నాసిర్ కు సంబంధం లేని వ్యక్తి ఫతా మీద దాడి చేసిన వారి వివరాలు తెలీడం లేదని పోలీసు అధికారి అరవింద్ పాఠక్ మీడియాకు చెప్పారు.

English summary
Two men, including a mosque Imam, were allegedly thrashed in Dankaur area of Uttar Pradesh on Saturday. The accused, who were unidentified, went to the mosque when the two men were praying and allegedly assaulted them. Both the victims were admitted to a hospital after the incident and are said to be stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X